మహిళ కడుపులో సెల్ ఫోన్ రింగ్ రింగ్
జోర్డాన్: మహిళ కడుపులో సెల్ ఫోన్ పెట్టి కుట్లు వేసి నీవు హాయిగా ఇంటికి వెళ్లవచ్చని చెప్పి వైద్యులు చేతులు దులుపుకున్నారు. ఇంటికి వెళ్లిన మహిళ అనారోగ్యానికి గురై మళ్లి ఆసుపత్రికి వెళ్లి ఎక్సరే తీయించుకుని చూడగా కడుపులో సెల్ ఫోన్ ఉన్న విషయం గుర్తించి షాక్ కు గురైనారు.
యెమెన్ కు చెందిన హనన్ మహమూద్ అబ్దుల్ కరీం (36) అనే మహిళ గర్బవతి. కడుపులో బిడ్డ లావుగా ఉండటంతో ప్రసవం కావడం కష్టం అయ్యింది. వెంటనే యమెన్ లోని అల్ బషిర్ పబ్లిక్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు హనన్ కు సిజేరియన్ చేసి కడుపులో బిడ్డను క్షేమంగా బయటకు తీశారు.
తరువాత మహిళ కడుపుకు కుట్లు వేసి పాపను అప్పగించారు. పాపతో కరీం దంపతులు సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. తరువాత ఆమె కడుపులో సెల్ ఫోన్ వైబ్రేషన్ తో మోగడం మొదలయ్యింది. అదే సమయంలో కడుపు నోప్పి ఎక్కువ కావడంతో ఆమె మళ్లి ఆసుపత్రికి వెళ్లారు.
ఆసుపత్రి వైద్యులు ఎక్సరే తీయించుకోవాలని ఆమెకు చెప్పారు. హనన్ ఎక్సరే తీయించుకున్నారు. ఎక్సరే తీసిన వ్యక్తి షాక్ కు గురైనాడు. మీ కడుపులో సెల్ ఫోన్ ఉందని చెప్పడంతో హనన్ హడలి పోయారు. వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులను నిలదీశారు.

హనన్ కు ఆపరేషన్ చేసిన మహిళ వైద్యురాలు ఆమె సెల్ ఫోన్ ను కడుపులో పెట్టి కుట్లు వేసిన విషయం వెలుగు చూసింది. వెంటనే హనన్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యం తలలు పట్టుకునింది.












Click it and Unblock the Notifications