Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు..?

ప్రపంచంలోనే ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదవాలని కలగా పెట్టుకుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ కు గురిచేసింది. విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రవేశం లేదని తేల్చి చెప్పడం ప్రపంచ దేశాలకు మింగుడు పడలేదు. అయితే తాజాగా ట్రంప్ కు అమెరికాలోని మసాచుసెట్స్ జిల్లా కోర్డు జడ్జి షాక్ ఇచ్చారు.

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో అమెరికాలోని మసాచుసెట్స్ జిల్లా కోర్డు జడ్జి ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన ఆదేశాలను బ్లాక్ చేశారు. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ మసాచుసెట్స్ జిల్లా కోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Judge Condemns Trump s Remarks on Harvard s Admissions of Foreign Students

మసాచుసెట్స్ జిల్లా కోర్డులోని జడ్జి అల్లీసన్ బారోగ్.. ట్రంప్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే హార్వర్డ్ లో ఇప్పటికే 788 మంది భారత్ యువత నమోదు చేసుకుంది. తాజా నిర్ణయంతో వీళ్లంతా ఇతర విద్యాసంస్థలకు బదిలీ కావాల్సి ఉంది. ట్రంప్ ఆదేశాలతో 2025 ప్రవేశాలన్నీ రద్దు అవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే కోర్టు ట్రంప్ ఆర్డర్ ను నిలిపివేయడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు నిర్ణయంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 7వేల మంది విదేశీ విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొంది హార్వర్డ్ యూనివర్సిటీ. ట్రంప్ సర్కార్ నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించాలని కోరింది. ఈ మేరకు ట్రంప్ ఆదేశాలను పరిశీలించిన బోస్టన్ కోర్టు ఆయన ఉత్తర్వులకు స్టే విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+