జర్నలిస్ట్‌లను తప్పించుకోబోయి..: ప్రియురాలితో జస్టిన్
లాస్ ఏంజిల్స్: ఫోటో జర్నలిస్టులను తప్పించుకునే ప్రయత్నంలో హాలీవుడ్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఓ కారును ఢీకొట్టాడు. లాస్ ఎంజెలిల్స్‌లో స్టేజ్ షో ఉండడంతో ప్రాక్టీస్ కోసం ఉంటున్న జస్టిన్ బెవెర్లీ హిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ అతనిని ఫోటో జర్నలిస్టులు వెంటాడారు.
వారి బారినుంచి తప్పించుకోవాలనే తొందరలో జస్టిన్ డ్రైవర్ కారును వేగంగా వెనక్కి తిప్పాడు. ఈ క్రమంలో వెనుకనున్న బీఎండబ్ల్యూ కారును ఢీ కొట్టాడు. ఈ సమయంలో జస్టిన్ వెనుక సీట్లో కూర్చొన్నాడు. ఈ ఘటనలో జస్టిన్‌కు గాయాలు కాలేదు. గతంలో తన ప్రియురాలు సెలెనా గోమెజ్‌తో జస్టిన్ కనిపించాడు.

కాగా, జస్టిన్ ఇంటి నుంచి భరించలేని కంపు వస్తోందని చుట్టుపక్కల ఇళ్ల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారట. లాస్ ఏంజెల్స్ పర్యటన ఉండడంతో ప్రాక్టీస్ చేసేందుకు అక్కడే ఓ భవనాన్ని బీబర్ అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంట్లో ఓ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో మారిజువానా అనే డ్రగ్ ఎక్కువ మోతాదులో వినియోగించారని, దాని వాసన తమ హాల్‌లోకి వచ్చిందని ఫిర్యాదు చేశారట.
మరోవైపు, జస్టిన్ బీబర్ తన ప్రియురాలి సెలెనా గోమేజ్‌తో కలిసి ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని జంతు ప్రదర్శన శాల, బొటానికల్ గార్డెన్ సందర్శించారట.












Click it and Unblock the Notifications