ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేసి..
లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తన ప్రియురాలు సెలెనా గోమెజ్ తో సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను ఇన్ స్టా గ్రామ్‌లో పెట్టాడు. అయితే ఆ తర్వాత దానిని డిలీట్ చేశాడు. ఆ ఫొటో కింద అతడు... తమది షరతుల్లేని ప్రేమ అంటూ ఓ కేప్షన్ కూడా రాశాడు.
గోమెజ్ పట్ల బీబర్ ప్రేమను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలా పలుమార్లు చేశాడు. కాగా బీబర్ పెట్టిన ఈ ఫోటోలో... 21 ఏళ్ల గోమేజ్ ఇరవై ఏళ్ల జస్టిన్ బీబర్‌కు దగ్గరగా ఉందట.

గతంలో వెస్ట్ హాలీవుడ్‌లో వానిటీ ఫెయిర్ అనంతరం ఓ ఫోటో పోస్ట్ చేశాడు. దాని కింద ప్రపంచంలోనే అత్యంత అందమైన యువరాణి అంటూ పోస్ట్ చేశాడు. కాగా,
కాగా, జస్టిన్ బీబర్ మార్చి 1, 1994లో జన్మించాడు. ఇతను యువ పాప్ సింగర్. ఇక బీబర్ ప్రేమిస్తున్న సెలెనా గోమేజ్ జూలై 22, 1992లో జన్మించింది. ఈమె సింగర్, నటి.












Click it and Unblock the Notifications