కూచిభొట్ల హత్య: టైమ్ మ్యాగజైన్‌కు ఎక్కిన కాన్సాస్ హీరో

హూస్టన్: తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్లను కాపాడే ప్రయత్నంలో బుల్లెట్ గాయాలు తిన్న కాన్సాస్ హీరో ఇయాన్ గ్రిల్లోట్‌ను టైమ్ మ్యాగజైన్ సత్కరించింది. నిరుడు జాత్యహంకార దాడిలో మృత్యువాత పడిన శ్రీనివాస్ కూచిభొట్లను ఆ అమెరికా జాతీయుడు కాపాడే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.

2017లో ఆమెరికా ఆశలను పెంచిన ఐదుగురు హీరోల్లో గ్రిల్లోట్ పేరు కూడా చోటు చేసుకుంది. కాన్సాస్‌లోని ఓ బారులో భారతీయులపై దాడికి దిగిన నేవీ ప్రముఖుడిని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నించారు.

Kansas shooting hero Ian Grillot honoured by Time magazine

దాడిలో కూచిభొట్ల మరణించిగా, అతని స్నేహితుడు ఆలోక్ మాడసాని తీవ్రంగా గాయపడ్డాడు. ఏదీ చేయకుండా తనంత తానుగా జీవించలేనని టైమ్ మ్యాగజైన్ ఆర్టికల్‌లో గ్రిల్లోట్ అన్నారు. ప్రార్థనలు, ప్రతి ఒక్కరి నుంచి లభించిన మద్దతు ఈ స్థితిలో ఉండడానికి ారణమని, తనకు ఇది అద్భుతమైన సంవత్సరమని, ఇప్పటికీ జీవించి ఉన్నానంటే దీవెనలేనని అన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఆయనను ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నిజమైన అమెరికా హీరోగా సత్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+