Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముచ్చటగా మూడో పెళ్లి, పెళ్లిలో పెళ్లి కొడుకుని తరిమి తరిమి కొట్టిన మొదటి భార్య, ఎంత మంది రా ? !

ఇస్లామాబాద్/కరాచి: వివాహ శుభకార్యానికి వధువు, వరుడితో పాటు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, బంధువు హాజరైనారు. గంటలో నిఖాతో నవ వరుడు, వదువు ఒక్కటి కానున్నారు. ఆ సమయంలో వేదిక మీద వధువు పక్కనే నిలబడి ఉన్న వరుడు బంధువులు, స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజు ఇస్తున్నాడు. ఆ సందర్బంలో వరుడి మొదటి భార్య షాదీ మహల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కసారిగా పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన భర్తను పట్టుకుని అతని పెళ్లి దుస్తులు చిరిగిపోయే వరకు షాదీ మహల్ లో తరిమి తరిమి కొట్టింది. ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న నీకు మళ్లీ మూడో పెళ్లి అవసరమా రా సాలే ? అంటూ పెళ్లి కొడుకుని తరిమితరిమి కొట్టటడంతో అంత వరకు ప్రశాంతంగా సందడిగా ఉన్న ఆ షాదీ మహల్ కళ్లు మూసి కళ్లు తెరిచేలోపు రణరంగం అయ్యింది.

మూడో పెళ్లికి అన్నీ సిద్దం

మూడో పెళ్లికి అన్నీ సిద్దం

పాకిస్థాన్ లోని కరాచిలోని సఖి హసన్ చౌరంగి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆసీఫ్ రఫీక్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి అన్నీ రంగం సిద్దం చేసుకున్నాడు. కరాచిలోని నార్త్ నిజామాబాద్ లోని షాదీ మహల్ లో వరుడు ఆసీఫ్ రఫీక్, వధువుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ సందడి చేస్తున్నారు. వచ్చి వెళ్లే వధువరుల బంధువులు ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నారు.

ఫోటోలకు ఫోజు ఇచ్చిన వరుడు

ఫోటోలకు ఫోజు ఇచ్చిన వరుడు

షాది మహల్ లోని వేదిక మీద రిసెప్షన్ లో వధువు పక్కనే నిలబడి ఉన్న ఆసీఫ్ రఫిక్ అక్కడికి వచ్చి వెలుతున్న బంధువులు, స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజు ఇస్తున్నాడు. అదే సమయంలో వేదిక మీద సందడి మొదలైయ్యింది. అప్పటికే ముస్లీం సాంప్రధాయ ప్రకారం జరగవలసిన అన్నీ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

వరుడిని తరిమి తరిమి కొట్టిన మొదటి భార్య

వరుడిని తరిమి తరిమి కొట్టిన మొదటి భార్య

ఒక గంటలో పెళ్లి తతంగం మొత్తం పూర్తి కావలసి ఉంది. అదే సమయంలో ఆఫీస్ రఫీక్ మొదటి భార్య మదీహా రిసెప్షన్ జరుగుతున్న వేదిక మీదకు వెళ్లింది. ఫోటోలకు ఫోజు ఇస్తున్న భర్త ఆసీఫ్ రఫీక్ కాలర్ పట్టుకుని అతన్ని చితకబాదేసింది. వరుడు ఆసీఫ్ రఫీక్ కళ్లు మూసి కళ్లు తెరిచే లోపు అతని మొదటి భార్య మదీహా అక్కడ రెచ్చిపోయింది.

నీకు మూడో పెళ్లి కావాలిరా సాలే ?

నీకు మూడో పెళ్లి కావాలిరా సాలే ?

వేదిక మీద ఏం జరుగుతుందో తెలీక అక్కడికి వెళ్లిన బంధువులు హడలిపోయారు. వేదిక మీద ఉన్న భర్త ఆసీఫ్ రఫీక్ ను కిందకు లాక్కొని వచ్చిన అతని మొదటి భార్య మదీహా చితకబాదేసింది. భర్త ఆసీఫ్ రఫీక్ బట్టలు చింపిన భార్య మదీహా అతన్ని షాదీ మహల్ తిప్పితిప్పి తరిమితరిమి కొట్టింది. ప్రశాంతంగా సందడిగా ఉన్న షాదీ మహల్ ఒక్కసారిగా రణరంగం కావడంతో పెళ్లికి వెళ్లిన వారు షాక్ కు గురైనారు.

జిన్నా యూనివర్శిటీ ఉద్యోగిని !

జిన్నా యూనివర్శిటీ ఉద్యోగిని !

షాదీ మహల్ లో మూడో పెళ్లి చేసుకుంటున్న వరుడు ఆసీఫ్ రఫీక్ 2014లో మదీహాను వివాహం చేసుకున్నాడు. తరువాత మొదటి భార్య మదీహాను ఒప్పించి 2018లో జిన్నా యూనివర్శిటీలో ఉద్యోగం చేస్తున్న యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. తాను రెండో పెళ్లి చేసుకున్నా నీతోనే కలిసి జీవిస్తానని ఆ సమయంలో తనకు మాట ఇచ్చాడని, చివరికి తనతో పాటు జిన్నా యూనివర్శిటీలో ఉద్యోగం చేస్తున్న రెండో భార్యకు ఆసీఫ్ రఫీక్ మోసం చేశాడని మొదటి భార్య మదీహా ఆరోపించిందని పాకిస్థాన్ లోని GeoTVతో పాట స్థానిక మీడియా వార్తలు ప్రసారం చేసింది.

చిత్రహింసలు, అందుకే మూడో పెళ్లి !

చిత్రహింసలు, అందుకే మూడో పెళ్లి !

తన మొదటి భార్య మదీహా, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తనను చిత్రహింసలకు గురి చేశారని, గతంలో అనేకసార్లు తన మీద దాడి చేశారని వరుడు ఆసీఫ్ రఫీక్ ఆరోపించాడు. అందుకే తమ మతం చట్టం (పాకిస్థాన్ ముస్లీం కుటుంబ చట్టం 1961) ప్రకారం మొదటి భార్య మదీహాకు తాను విడాకులు ఇచ్చానని, విడాకులు తీసుకున్న తరువాత తాను ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకునే హక్కు ఉందని ఆసీఫ్ రఫీక్ వాదిస్తున్నాడు.

భార్య, భర్తలపై పోలీసు కేసులు

భార్య, భర్తలపై పోలీసు కేసులు

తనతో పాటు రెండో భార్యకు ద్రోహం చేసిన ఆసీఫ్ రఫీక్ మీద చర్యలు తీసుకోవాలని మొదటి భార్య మదీహా పోలీసులకు ఫిర్యాదు చేసింది. షాదీ మహల్ లో గొడవ చేసి తన పెళ్లి ఆగిపోవడానికి కారణం అయిన తన మాజీ భార్య మదీహా, ఆమె కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఆసీఫ్ రఫిక్ సైతం పోలీసులను ఆశ్రయించాడు. మొదటి భార్య మదీహాతో పాటు ఆమె బంధువులు దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన వరుడు ఆసీఫ్ రఫీక్ ను అబ్బాసి షాహీద్ ఆసుపత్రికి తరలించారు. ఆసీఫ్ రఫీక్, మదీహా ఫిర్యాదు మేరకు కరాచిలోని నార్త్ నిజామాబాద్ లోని తైమురియా పోలీసులు కేసులు నమోదు చేశారు. పెళ్లిలో జరిగిన గొడవలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+