10 నెలు లైంగిక సంబంధం, ట్రంప్‌తో పెళ్ళి జరుగుతోందనుకొన్నా, క్షమాపణ: మెక్ డౌగల్
Recommended Video

న్యూయార్క్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు పది మాసాల పాటు శారీరక సంబంధం ఉందని మాజీ ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ చెప్పారు. ఈ విషయమై తాను ట్రంప్ సతీమణి మెలానియాకు క్షమాపణలు చెబుతున్నట్టుగా ఆమె ప్రకటించారు..
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోర్న్‌స్టార్ డానియెల్‌తో వివాహేతర సంబంధం ఉందని మరువక ముందే ప్లేబాయ్ మేగజిన్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ కూడ తనతో ట్రంప్‌కు శారీరక సంబంధాలున్నాయని ప్రకటించింది.
ఈ సంబంధం బట్టబయలు కాకుండా చేసుకొన్న ఒప్పందం నుండి విముక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహరం బట్టబయలైంది. దరిమిలా సీఎన్ఎన్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.

10 నెలల పాటు ట్రంప్‌తో సంబంధం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కాకముందు ఆయనతో తనకు శారీరక సంబంధం ఉందని ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ ప్రకటించారు. 2006 నుండి 2007 మధ్య ట్రంప్‌కు తనకు మధ్యశారీరక సంబంధాలున్నాయని ఆమె ప్రకటించారు. ఈ మేరకు సీఎన్‌ఎన్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు.ఈ విషయమై మెక్ డౌగల్ తొలిసారి మీడియా ముందు నోరు విప్పారు.

పెళ్ళి చేసుకొంటాడని భావించా
పది మాసాల కాలంలో ట్రంప్ తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ప్రకటించిన ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ ఈ సంబంధం పెళ్ళి వరకు దారి తీస్తోందని భావించినట్టు చెప్పారు. తనను ట్రంప్ వివాహం చేసుకొంటాడని తాను భావించానని ఆమె చెప్పుకొన్నారు.. కానీ, పెళ్ళి చేసుకోకుండానే తమ మధ్య సంబంధం తెగిపోయిందన్నారు.

మెలానియాకు క్షమాపణ
ట్రంప్ సతీమణి మెలానియాకు ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ క్షమాపణ చెప్పారు మెలానియాకు తెలియకుండానే తాను ట్రంప్‌తో వివాహేతర సంబంధం కొనసాగించినందుకు క్షమాపణలు కోరుకొంటున్నట్టు ఆమె చెప్పారు. భవిష్యత్తులో ఇలా చేయకూడదని నిర్ణయం తీసుకొన్నానని ఆమె చెప్పారు. మెలానియాకు ఇంతకంటే ఏం చెప్పగలని ఆమె చెప్పారు.

గాఢంగా ప్రేమించుకొన్నాం
ట్రంప్ తనతో పాటు ఉన్న పది మాసాల పాటు తామిద్దరం కూడ గాఢంగా ప్రేమించుకొన్నామని ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ చెప్పారు. ట్రంప్ కూడ ఎన్నోసార్లు తనను ప్రేమిస్తున్నట్టు చెప్పిన విషయాన్ని ఆమె సిఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ప్రతిసారి కూడ ట్రంప్ ఇదే విషయాన్ని చెప్పాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications