జో బిడెన్ టీమ్‌లో కన్నడిగ: కీలక బాధ్యతలు అప్పగింత: ప్రథమ మహిళ డైరెక్టర్‌గా
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ టీమ్‌లో చేరుతోన్న ప్రవాస భారతీయుల సంఖ్య ఒక్కటొక్కటిగా పెరుగుతోంది. ఇదివరకే కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌లో వారు నియమితులు అయ్యారు. తాజాగా మరో ఇద్దరు ఆయన టీమ్‌లో చేరారు. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికే చెందిన కమలా హ్యారిస్ ఎన్నికైన తరువాత.. బిడెన్ ప్రభుత్వంలో భారతీయులకు ప్రాధాన్యత లభిస్తోంది. మరో భారత సంతతికి మహిళకు వైట్‌హౌస్ చోటు దక్కింది. జో బిడెన్ భార్య, కాబోయే ప్రథమ మహిళ జిల్ బిడెన్ పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగా నియమితులు అయ్యారు.
మాలా అడిగా పూర్వీకులు కర్ణాటకలోని కుందాపురకు చెందినవారు. ఉడుపి జిల్లా కుందాపుర తాలూకాలోని కక్కుంజే గ్రామానికి చెందిన డాక్టర్ రమేష్ అడిగా కుమార్తె ఆమె. తల్లి జయ అడిగా కూడా డాక్టరే. వేలూర్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. అనంతరం వారు అమెరికాలో స్థిరపడ్డారు. మాలా అడిగా అక్కడే జన్మించారు. ఛార్లెస్ బైరోను పెళ్లి చేసుకున్నారు. వారికి ఆషా అనే కుమార్తె ఉన్నారు. కుందాపురలో ఇప్పటికీ ఆమె బంధువులు నివసిస్తున్నారు. బంధువుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతుంటారు.

ఇదివరకు ఆమె జిల్ బిడెన్ సీనియర్ సలహాదారుగా, ఎన్నికల క్యాంపెయిన్‌లో సీనియర్ పాలసీ సలహాదారు మాలా అడిగా పనిచేశారు. డెమొక్రాటిక్ పార్టీకే చెందిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోనూ మాలా కీలక బాధ్యతల్లో విధులను నిర్వర్తించారు. ఇల్లినాయిస్‌కు చెందిన మాలా అడిగా న్యాయ విద్యను అభ్యసించారు. గ్రిన్నెల్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Recommended Video
కొంతకాలం పాటు న్యాయవాదిగా పని చేశారు. 2008లో డెమొక్రటిక్ పార్టీలో చేరారు. ఒబామా క్యాంపెయిన్ టీమ్‌లో చోటు దక్కించుకోగలిగారు. ఒబామా ప్రభుత్వ హయాంలో అసోసియేట్ అటార్నీ జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీగానూ బాధ్యతలు చేపట్టారు. తర్వాత బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా ఆమెను ప్రథమ మహిళకు పాలసీ డైరెక్టర్‌గా నియమించారు జో బిడెన్.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications