వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైనమిక్ దీపికా: కథువా న్యాయవాదికి ఎమ్మా వాట్సన్ మద్దతు..

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: హ్యారీ పోటర్ నటి, ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్ కథువా రేప్ ఘటనపై స్పందించారు. ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్(38)కు ఆమె మద్దతు పలికారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

కథువా రేప్: చిట్టితల్లి హత్యాచారం వెనుక కొన్ని కఠిన నిజాలుకథువా రేప్: చిట్టితల్లి హత్యాచారం వెనుక కొన్ని కఠిన నిజాలు

కథువా రేప్ ఘటనకు సంబంధించిన ఓ వార్తను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఆమె.. 'అన్ని అధికారాలు దీపికా సింగ్ రజావత్ కే' అంటూ కామెంట్ చేశారు. ఆమె షేర్ చేసిన ఫోటోలో 'ఇలాంటి ఫోటోను ఎన్నిసార్లు చూసుంటాం?. ఆత్మవిశ్వాసం, వృత్తి పట్ల నిబద్దత ఉన్న ఓ మహిళా న్యాయవాది..' అంటూ దీపికా సింగ్ గురించి పేర్కొనడం గమనార్హం.

Kathua Rape Victims Lawyer Gets A Fist Of Approval From Emma Watson

కాగా, కథువా రేప్ కేసు వాదిస్తున్నందుకు గాను చంపేస్తామని, రేప్ చేస్తామని దీపికాకు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కథువా అత్యాచార ఘటనకు సంబంధించి మొట్టమొదట రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు దీపికా సింగ్. చిన్నారి తండ్రితో కోర్టులో కేసు దాఖలు చేశారు. బెదిరింపులను సైతం లెక్క చేయకుండా.. హంతకులకు శిక్ష పడేవరకు తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఎమ్మా వాట్సన్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎమ్మా వాట్సన్ ప్రస్తుతం మహిళల సాధికారత కోసం, జాత్యహంకారాన్ని రూపుమాపడం కోసం తనవంతుగా కృషి చేస్తున్నారు.

English summary
"Harry Potter" star Emma Watson on Friday tweeted in support of lawyer Deepika Singh Rajawat, who is fighting the case of a minor girl whose rape and murder in Kathua district of Jammu and Kashmir sent shockwaves globally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X