అభిమానినంటూ చనువు, డ్రింక్ ఇచ్చి మోడల్‌ను రేప్ చేశాడు
లండన్: అభిమానిని అంటూ సెలబ్రిటీని రేప్ చేసిన సంఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. లండన్‌లో ఓ అభిమాని ఏకంగా స్టార్ సెలబ్రిటీనీ రేప్ చేశాడు. ఇది సంచలనం అయింది. బ్రిటిష్ డేటింగ్ రియాల్టీ షో లవ్ ఐలాండ్ నటి, ప్రముఖ మోడల్ కేటీ సాల్మన్ అభిమాని చేతిలో అత్యాచారానికి గురయింది.
నేను మీకు చాలా మంచి అభిమానిని అని ఆమెకు దగ్గరైన ఓ వ్యక్తి,, ఆమెకు తెలియకుండా కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపించాడు. అది తాగిన ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఆ తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. లండన్‌లో ప్రముఖ పత్రికలో ఈ కథనం వచ్చింది.

దాని ప్రకారం మోడల్ కేటీ సాల్మన్ మంగళవారం రాత్రి తన స్నేహితులతో పాటు నైట్ క్లబ్‌కు వచ్చింది. అక్కడ డేనియల్ అనే వ్యక్తి అభిమానిని అని చెప్పి కేటీ సాల్మన్‌తో కరచాలనం చేశాడు. మాటలు కలిపాడు. అభిమానే కదా అని ఆమె కూడా కాస్త చనువు ఇచ్చింది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆమెకు కూల్‌డ్రింక్ అందించాడు.
అందులో ఆమెకు తెలియకుండా మత్తు మందు కలిపాడని తెలుస్తోంది. ఆమె మత్తులోకి వెళ్లింది. ఆమె మత్తు నుండి తేరుకునే అతను ఘాతుకానికి ఒడిగట్టాడు. మెలకువ వచ్చే సమయానికి తెల్లవారుజామున నైట్ క్లబ్‌కు కొంతదూరంలో గాయాలపాలై, తాను అత్యాచారానికి గురైనట్లు ఉన్న ఆనవాళ్ళతో తన స్థితిని చూసి ఆమె షాకైంది.
పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం కేటీ సాల్మన్, ఆమె స్నేహితురాలు, డేనియల్ కలిసి అర్థరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో నైట్ క్లబ్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు సీసీ టీవీల్లో రికార్డయింది. కేటీ సాల్మన్ అతనితో ఉండటంతో స్నేహితురాలు అక్కడి నుండి వెళ్లింది.
అభిమాని అని చెప్పి మత్తు మందు కలిపి అత్యాచారం చేయడమే కాక ఆమె హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోన్ కూడా డానియేల్ ఎత్తుకెళ్లాడు. కానీ సాల్మన్ మాత్రం అత్యాచారం జరిగినట్లు గుర్తులేదని పోలీసులకు తెలిపింది. అతడు తనకు డ్రింక్స్ అందించడం వరకు గుర్తుకు ఉందని, తర్వాత ఏమైందో తెలియదని చెప్పింది. నిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications