వన్ సైడ్ లవ్: ఒబామా కూతురును ప్రేమిస్తున్నానన్న కెన్యా లాయర్, కన్యాశుల్కం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా పైన కెన్యాకు చెందిన ఓ యువలాయర్ మనసు పారేసుకున్నాడు.
ఫెలిక్స్ కిప్రోనో అనే న్యాయవాది మలియాను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని అంటున్నారు. మలియాను తనకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆమెకు కన్యాశుల్కం ఇస్తానని చెప్పాడు.
తనకు మలియాను ఇస్తే 70 గొర్రెలు, 50 గోవులు, 30 మేకలను తన మామకు సమర్పించుకుంటానని చెప్పడం గమనార్హం.

మలియా
తన ప్రేమ స్వచ్ఛమైనదని సదరు యువ లాయర్ చెబుతున్నాడు. జీవితంలో డబ్బు అనేదే ముఖ్యం కాదని ఆయన చెబుతున్నాడు.

మలియా
2008లోనే మలియాతో వన్ సైడ్ లవ్‌లో పడ్డానని అతను చెప్పాడు. తాను ఇంతవరకి ఎవరితోను డేటింగ్ చేయలేదని, ఆమెకు విధేయుడిగా నడుచుకుంటానని చెప్పాడు.

మలియా
జూలైలో బరాక్ ఒబామా కెన్యాలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో తాను ఒబామాతో మాట్లాడుతానని, మలియాను కెన్యా పర్యటనకు తీసుకు రమ్మని లేఖ రాస్తానని చెప్పాడు.

మలియా
బరాక్ ఒబామాకు ఇదందరు కూతుళ్లు ఉన్నారు. అందులో కెన్యా లాయర్ తాను ప్రేమించానని చెబుతున్న మలియా వయస్సు ఇప్పుడు 16.

మలియా
కాగా, తాను మలియాను ప్రేమిస్తున్నానని చెబుతున్న యువ లాయర్ కిప్రోనో వయస్సు తెలియరావడం లేదు. అయితే తాను ఇప్పటి వరకు ఎవరితోను డేటింగ్ చేయలేదని చెప్పడం గమనార్హం.

మలియా
తాను మలియాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని, డబ్బుల కోసం ప్రేమించడం లేదని చెప్పాడు. నా ప్రేమ నిజమైందన్నాడు.

మలియా
తాను కాలెంజిన్ ట్రైబ్ ట్రెడిషన్‌లో మలియాకు ప్రపోజ్ చేస్తానని చెప్పాడు. ఆమెకు తాను తమ ప్రాంతంలో ప్రపోజ్ చేస్తానని చెప్పాడు.

మలియా
మలియాకు తాను పలు విషయాలు నేర్పుతానని చెప్పాడు. ఆవు నుండి పాలు పితకడం, ఉగాలి, ఇతరాలు వండటం వంటివి నేర్పుతానని చెప్పాడు.

మలియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా పైన కెన్యాకు చెందిన ఓ యువలాయర్ మనసు పారేసుకున్నాడు.












Click it and Unblock the Notifications