పీక్స్‌లో శాడిజం: భార్య మర్మాంగానికి గమ్: నలుగురితో ఎఫైర్ డౌట్స్: సోషల్ మీడియాలో న్యూడ్ పిక్స్.. !

నైరోబి: భార్యపై ఉన్న అనుమానంతో ఏ భర్తా చేయకూడదని దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె మర్మాంగానికి గమ్‌ను పూశాడు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. పలుమార్లు. భర్త ఘాతుకానికి ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స సందర్భంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనితో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

ఇంట్లో లేని సమయంలో ఇతరులతో..

ఇంట్లో లేని సమయంలో ఇతరులతో..

కెన్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ శాడిస్ట్ భర్త పేరు డెన్నిస్ ముమో. తన భార్యతో కలిసి కిటుయ్ టౌన్‌లో నివాసం ఉండేవాడు. సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తుండేవాడు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా తరచూ ఇళ్లొదిలి వెళ్లాల్సి వస్తుండేది అతనికి. ఈ క్రమంలో అతనికి తన భార్య ప్రవర్తనపై అనుమానం ఏర్పడింది. తాను ఇంట్లో లేని సమయంలో భార్య ఇతరులతో సెక్స్‌లో పాల్గొంటున్నదనే అనుమానం కలిగేది.

భార్య సోషల్ మీడియా అకౌంట్‌లో న్యూడ్ పిక్స్..

భార్య సోషల్ మీడియా అకౌంట్‌లో న్యూడ్ పిక్స్..

ఈ అనుమానంతోనే డెన్నిస్.. తన భార్య సోషల్ మీడియాలో అకౌంట్‌ను పరిశీలించగా.. ఆమెకు సంబంధించిన కొన్ని నగ్న ఫొటోలు కనిపించాయి. తన భార్య నలుగురు వ్యక్తులకు ఈ న్యూడ్ ఫొటోలను పంపించినట్లు గుర్తించాడు. దీనితో క్రూరంగా మారిపోయాడు. అప్పటి నుంచి తాను ఇళ్లొదిలి వెళ్లే సమయంలో భార్య మర్మాంగానికి సూపర్ గ్లూ, గమ్‌ను పూసేవాడు. తాను మళ్లీ ఇంటికి వచ్చేంత వరకూ అది అలాగే ఉండాలని హూంకరించేవాడు. మర్మాంగం మూసుకుని పోవడం వల్ల ఆమె మూత్ర విసర్జనకు కూడా వెళ్లలేని బాధను అనుభవించారు.

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో..

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో..

తనకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదంటూ బాధితురాలు వేడుకున్నప్పటికీ.. ఫలితం లేకుండా పోయేది. పలుమార్లు డెన్నిస్ ఇలా భార్యపై శాడిజాన్ని ప్రదర్శిస్తుండే వాడు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. మర్మాంగ సంబంధ వ్యాధి బారిన పడ్డారు. మూత్ర విసర్జన నాళాలు స్తంభించిపోయింది. దీనితో ఆమెను ఆసుపత్రికి తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తరచూ గమ్, సూపర్ గ్లూ పూయడం వల్ల ఆమె మర్మాంగం, మూత్ర నాళం దెబ్బతిన్నట్లు గుర్తించారు.

ఛార్జిషీట్ నమోదు చేసిన పోలీసులు

ఛార్జిషీట్ నమోదు చేసిన పోలీసులు

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కిటుయ్ పోలీసులు డెన్నిస్ అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా అతను తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. వ్యాపార కార్యకలాపాల కోసం డెన్నిస్ తరచూ రువాండాకు వెళ్లుండేవాడని, భార్య ప్రవర్తనపై అనుమానంతో ఇల్లొదిలి వెళ్లే ప్రతీసారీ అతను భార్య మర్మాంగానికి గమ్, సూపర్ గ్లూ పూసేవాడని ఛార్జిషీట్‌లో నమోదు చేశారు. అతని శాడిజాన్ని ఈ ఛార్జిషీట్‌లో నమోదు చేశారు.

నేరాన్ని అంగీకరించిన శాడిస్ట్..

నేరాన్ని అంగీకరించిన శాడిస్ట్..

సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని న్యూడ్ ఫొటోలు కనిపించడం, వాటిని ఆమె నలుగురు వ్యక్తులకు షేర్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో భార్య ప్రవర్తనపై అనుమానం ఏర్పడిందని తెలిపారు. ఆ అనుమానంతోనే తాను ఆ పని చేసినట్లు నిందితుడు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు. చట్టప్రకారం పలు కేసులను నమోదు చేశామని వెల్లడించారు. అతణ్ని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం అతణ్ని రిమాండ్‌కు తరలించారు. వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికే తాను ఈ దారుణానికి పాల్పడినట్లు డెన్నిస్ అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+