కెఎఫ్‌సి షాక్: చికెన్ ఆర్డరిస్తే.. ఎలుక ఫ్రై తెచ్చారు

వాషింగ్టన్: డేవరైస్ డిక్సన్ జూన్ 12న ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఓ షాకింగ్ ఫొటోను పోస్ట్ చేశారు. డిక్సన్ పోస్ట్ చేసిన ఆ ఫొటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఫొటోతో ప్రముఖ ఆహార సంస్థ కెఎఫ్‌సి‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

విషయమేంటంటే.. డిక్సన్ చికెన్ ఫ్రై ఆర్డర్ చేస్తే.. కెంటకీ ఫ్రైడ్ చికెన్(కెఎఫ్‌సి) మాత్రం ఎలుక ఫ్రై పంపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన డిక్సన్.. ఆ ఫొటోలను సోషల్ మిడియాలో పోస్ట్ చేశారు.

‘నిన్నటి రోజున కెఎఫ్‌సి యాజమాన్యంను ఈ విషయంపై నిలదీశా. అది ఎలుక అని.. మేనేజర్ నాకు క్షమాపణ చెప్పారు. దీంతో ఫాస్ట్‌ఫుడ్ ఇకపై తినకూడదని నిర్ణయించుకున్నా' అని చెప్పారు.

ఎలుక ఫ్రై ఫొటోపాటు డిక్సన్ ఓ వీడియోను కూడా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అప్‌లోడ్ చేశారు. కాలిఫోర్నియాలోని ఓ కెఎఫ్‌సి సెంటర్.. డిక్సన్‌కు చికెన్ ఫ్రై బదులు ఈ ఎలుక ఫ్రైను పంపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+