10బాటిళ్ల వైన్.. చుట్టూ అమ్మాయిలు: రాత్రంతా ఆ అధ్యక్షుడికి అదే పని
ఉత్తరకొరియా : హైడ్రోజన్ బాంబు అంటూ ప్రపంచాన్ని హడలెత్తించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. అధ్యక్ష పీఠం అలంకరించిన నాటి నుంచి.. ఆయన వివాదాలకు, అనుభవిస్తోన్న భోగాలకు లెక్కే లేకుండా పోయిందన్న వాదనలున్నాయి.
భోజన ప్రియుడైన కిమ్ ఆరోగ్య సమస్యలను సైతం లెక్క చేయకుండా.. చాలా వంటకాల్ని లాగించేస్తున్నారట. ముఖ్యంగా స్విస్ జున్ను అంటే అమితంగా ఇష్టపడే కిమ్.. విపరీతంగా జున్ను పదార్థాలు తింటూ లావు పెరిగిపోతున్నారని చెబుతున్నారు. కిమ్ కు ఉత్తరకొరియాలో తయారుచేసే జున్ను అంటే రుచించదట. దీంతో కొంతమంది షెఫ్ లను ప్రత్యేకంగా స్విట్జర్లాండ్ కు పంపించి మరీ.. అక్కడ జున్ను తయారీలో శిక్షణ ఇప్పించారట.

స్విట్జర్లాండ్ కే ఎందుకు పంపించారన్న అనుమానం రావచ్చు! ఎందుకంటే.. స్విట్జర్లాండ్‌లోని బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో అక్కడి చీజ్ తెగ తినేవాడట కిమ్. తిండి సంగతి ఇలా ఉంటే, తిండితో పాటు మందు లేనిదే ఆయనకు ముద్ద దిగదు అని చెబుతున్నారు అతని వంట మనషి కెంజి ఫుజిమోజో. పదిబాటిళ్ల వైన్ తో పాటు కప్పుల మీద కప్పుల జున్నును ప్రతీరోజు రాత్రి లాగించేస్తారట. చుట్టూ అందమైన అమ్మాయిలుంటే గానీ కిమ్ కు భోజనం రుచించదట.
ఇలా ప్రతీరోజు మందు విందు మగువతో.. ఆయన చేస్తోన్న రాచకార్యాలపై పుంఖా పుంఖానులుగా కొరియా జనం మాట్లాడుకుంటున్నారట.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications