వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?

పాలబుగ్గలతో కనిపించే కిమ్ 'బిచ్‌కు పుట్టినోడు' అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు.

|
Google Oneindia TeluguNews

మనీలా: క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరి పట్ల ప్రపంచ దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా వంటి శక్తివంతమైన దేశాలు ఉత్తరకొరియా తీరుపై గుర్రుగా ఉన్నాయి.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా! ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

అగ్రరాజ్యం అమెరికా సైతం మా ముందు దిగదుడుపే అన్నట్లు ఉత్తరకొరియా వ్యవహరిస్తుండటం ఆ దేశానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. నిన్న మొన్నటిదాకా ఖండాంతర క్షిపణులతో అమెరికాను టార్గెట్ చేసిన ఉత్తరకొరియా.. తాజాగా సబ్ మెరైన్ మిసైల్ లాంచ్ సిస్టమ్ ను పరీక్షంచడం మరింత కలవరపాటుకు గురిచేసింది.

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి విమర్శలు:

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి విమర్శలు:

క్షిపణి ప్రయోగాలపై మరో దేశాధ్యక్షుడు కూడా ఇప్పుడు ఉత్తరకొరియాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్ట్.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ను పిచ్చోడిగా అభివర్ణించారు. అంతేకాదు.. పాలబుగ్గలతో కనిపించే కిమ్ 'బిచ్‌కు పుట్టినోడు' అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు.

కిమ్‌కు రొడ్రిగో హెచ్చరిక:

కిమ్‌కు రొడ్రిగో హెచ్చరిక:

ఉత్తర కొరియా దీర్ఘకాలిక క్షిపణుల పరీక్షలపై ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అంతర్జాతీయ సమావేశం జరగడానికి కొన్ని రోజుల ముందు రోడ్రిగో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రమాదకరమైన బొమ్మలతో కిమ్ ఆటలాడుతున్నారని రొడ్రిగో హెచ్చరించారు.

అణుయుద్ద వాతావారణాన్ని తక్షణం ఆపేయాలని, లేదంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రొడ్రిగో అన్నారు. కాగా, ఉత్తర కొరియాతో సంబంధాలున్న అన్ని దేశాల మంత్రులు వచ్చే వారం మనీలాలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ క్షిపణి పరీక్షలపై చర్చించనున్నారు.

ప్రతీ జనరేషన్ లోను ఒక పిచ్చోడు:

ప్రతీ జనరేషన్ లోను ఒక పిచ్చోడు:

గత మే నెలలోను రొడ్రిగో కిమ్ జాంగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ ద్వారా సంభాషించిన సందర్భంగా.. వీరిద్దరి మధ్య ఉత్తరకొరియా అంశం చర్చకు వచ్చింది. కిమ్ జాంగ్ పై మీ అభిప్రాయమేంటో చెప్పాలని ట్రంప్ రొడ్రిగోను కోరారు.

'ప్రతీ జనరేషన్ లోను ఒక పిచ్చోడు ఉంటాడని, మన జనరేషన్ లో అది కిమ్ జాంగ్' అని రొడ్రిగో ట్రంప్ కు బదులిచ్చారు. మీరు చాలా సున్నితమైన సమస్యతో డీలింగ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

తగ్గని ఉత్తరకొరియా:

తగ్గని ఉత్తరకొరియా:

ప్రపంచ దేశాలన్ని ఎంతగా మొత్తుకుంటున్నా ఉత్తరకొరియాకు మాత్రం చీమ కుట్టినట్లయినా అనిపించడం లేదు. ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా.. క్షిపణి ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. తాజాగా సబ్ మెరైన్ మిస్సైల్ లాంచ్ సిస్టమ్ ను కూడా పరీక్షించడం.. అమెరికాను సైతం వణికిస్తోంది. ఉత్తరకొరియాను ఇలాగే వదిలేస్తే.. తమ దేశానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అమెరికా భావిస్తున్నప్పటికీ.. యుద్దం సరికాదన్న అభిప్రాయంతో కాస్త వెనుకడుగు వేస్తోంది.

English summary
Philippine President Rodrigo Duterte’s latest controversial remarks target the North Korean regime, and they come just a few days ahead of his hosting a meeting of foreign diplomats at the Association of Southeast Asian Nations (ASEAN) Regional Forum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X