వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియమైన నా ప్రజలారా ‘కుక్క మాంసం’తినండి

|
Google Oneindia TeluguNews

ఉత్తర కొరియా: ప్రియమైన నా దేశ ప్రజలారా, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కుక్క మాంసాన్ని కడుపునిండా తినండి అంటూ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ జాతికి పిలుపునిచ్చారు.

చికెన్, బీఫ్, పోర్క్, బాతు మాంసాల కంటే కుక్క మాంసం ఎంతో బలవర్దకమైనదని జాతికి పిలుపునిచ్చారు. ఉత్తర కొరియాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఆదేశాధినే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుక్కమాంసంలో అద్బుత పోషక విలువలు ఉన్నాయని, అందులోని విటమిన్స్ మనిషికి శక్తివంతమైన బలాన్ని ఇస్తాయని కిమ్ జాంగ్ ఉన్ చెప్పినట్లు స్థానిక వార్త సంస్థలు వెల్లడించాయి.

Kim Jong Un labels Dog Meat a Superfood

ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ కు మద్దతుగా కొరియా అధికార టీవీ చానెల్, వార్తా పత్రికలు సైతం కుక్క మాంసం గొప్పతనంపై పుంఖానుపుంఖాలుగా వార్తలు వ్రాస్తున్నాయని ది కొరియా టైమ్స్ పేర్కొంది.

కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆదేశ ప్రజలు ఒక అడుగు ముందుకు వేశారు. కుక్కను మామూలుగా చంపి తినేకంటే దానిని హింసించి దారుణంగా చంపిన తరువాత ఆ మాంసం తింటే చాల రుచిగా ఉంటుందంటూ యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు. నియంతకు తగ్గట్టే ఆ దేశ ప్రజలు ఉన్నారని కొన్ని మీడియా సంస్థలు అంటున్నాయి.

English summary
It comes after a number of media outlets in North Korea have recently published stories about the health benefits of consuming dog meat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X