ఆసక్తికరం: దక్షిణ కొరియాకు అంద గత్తెల సైన్యాన్ని పంపనున్న కిమ్
ప్యాంగ్యాంగ్:వరుస అణు క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ రూట్ మార్చారు. దక్షిణ కొరియాతో శాంతి జపాన్ని పాటిస్తోంది. అంతేకాదు దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో తన అందగత్తెల బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఇప్పటివరకు క్షిపణి పరీక్షలు, ఖండాంతర క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయబ్రాంతులకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కొత్త సంవత్సరం నుండి రూట్ మార్చారు.
అదే సమయంలో దక్షిణ కొరియాతో చర్చలతో సంబంధాలు కోరుకొంటున్నట్టు చెప్పారు. ఆ దిశగా రెండు దేశాల మధ్య చర్చలు కూడ ప్రారంభమయ్యాయి. అంతే కాదు దక్షిణ కొరియాకు తన అందగత్తెల సైన్యాన్ని పంపాలని నిర్ణయం తీసుకొన్నారు.

అందగత్తెల సైన్యాన్ని పంపాలని కిమ్ నిర్ణయం
దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్‌కు ఒక అందగత్తెల సైన్యాన్ని పంపాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సంచలన నిర్ణయాన్ని తీసుకొన్నారు.ఉత్తర కొరియా అథ్లెట్లతో పాటూ ఈ బృందాన్నీ దక్షిణ కొరియాకు పంపనున్నారు. తమ దేశ ఆటగాళ్ళకు మంచి పేరు రావాలని కోరారు.

సైనిక దుస్తుల తరహలో దుస్తుల డిజైన్
సైనిక దుస్తుల తరహాలో డిజైన్ చేసిన దుస్తులు ధరించిన 230 మంది నృత్యాలు చేస్తారు. పాటలు పాడతారు. నినాదాలు చేసేందుకు అందగత్తెల సైన్యాన్ని పంపాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఉత్తరకొరియా ఎక్కువ పతకాలు గెలవదా
ఉత్తర కొరియా క్రీడాకారులు అక్కడ పతకాలు గెలిచే అవకాశమే లేదు. వారు క్రీడలకు ఇస్తున్న విలువ కన్నా ప్రచార ఆదుర్దాయే ఎక్కువగా కనిపిస్తోందని వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ నార్త్ కొరియా స్టడీస్ నూతన అధ్యక్షుడు అహ్న్ చాన్ ఇల్ తెలిపారు.

ఉత్తరకొరియా మారినట్టేనా
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మారినట్టేనా అనే చర్చ సాగుతోంది. దక్షిణ కొరియా దేశంతో సామరస్యపూర్వక వాతావరణాన్ని కోరుకొంటున్నట్టు ఉత్తరకొరియా అధ్యక్షుడు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటించారు దీంతో దక్షిణ కొరియాతో సంబంధాలు కోరుకొంటుంది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని కిమ్ కోరుకోవడం మంచి పరిణామమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications