కారణమిదే: సోదరికి కిమ్ కీలక బాధ్యతలు?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అధికారాన్ని తన కుటుంబానికి పరిమితం చేస్తున్నాడు. అధికారంలో కీలక బాధ్యతలను తన సోదరి కిమ్ జోంగ్‌కు అప్పగించనున్నారని సమాచారం. తద్వారా అధికారాన్ని మరింత బలపరుచుకునే విధంగా అడుగులు వేయబోతున్నాడు.
28 ఏళ్ల తన సోదరి కిమ్ జోంగ్‌కు కిమ్ కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడని సమాచారం. తద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవటంతోపాటు.. అధికారాన్ని కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంచాలని భావిస్తున్నాడని స్పష్టమౌతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్యోంగ్ యాంగ్‌లో శనివారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అమెరికా బెదిరింపులతోపాటు జోంగ్‌కు బాధ్యతలు అప్పజెప్పే విషయంపై కూడా చర్చించినట్లు అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కీలక పాలనా విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కిమ్ సమావేశంలో వ్యక్తం చేశారని సమాచారం.ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలో ఆరుగురు అధికారులతోపాటు జోంగ్‌కు కూడా స్థానం కల్పించబోతున్నట్లు కిమ్ సూచన ప్రాయంగా చెప్పాడని ఈ కథనం సారాంశం. మానవ హక్కుల ఉల్లంఘన కింద ఆమెపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.
కరడుగట్టిన నియంతగా పేరొందిన కిమ్ తన చెల్లెలికి కీలక బాధ్యతలు అప్పజెప్పటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కిమ్ జంగ్ ఉన్, కిమ్ యో జోంగ్‌లు ఒకే తల్లికి జన్మించారు. తన పక్కన ఉండే అధికారులతోసహా ఎవరినీ నమ్మని కిమ్.. జోంగ్‌ను మాత్రం బాగా నమ్ముతాడని చెబుతుంటారు. అన్నతోపాటు తరచూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారామె.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications