ఆసక్తికరం: ఓటమిని సహించడు, కోపమెక్కువ: కిమ్ స్నేహితులు
Recommended Video

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. వరుసగా అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా పేరును ప్రపంచదేశాల్లో మార్మోగేలా చేస్తున్నాడు. కిమ్ స్కూల్ లో చదువుకొనే సమయంలో పాక్ యున్ అంటూ స్నేహితులు ఆట పట్టించేవారు. కిమ్ తో పాటు చదవుకొన్న కొందరు స్నేహితులు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను కిమ్ గురించి వివరించారు.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసురుతున్నాడు. అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో కిమ్ ప్రపంచానికి చుక్కలు చూపుతున్నాడు. అయితే అదే సమయంలో అమెరికాతో పాటు అణ్వాయుధాల విషయంలో పోటీ పడుతున్నాడు.
అణ్వాయుధాల శక్తిని పెంపొందించుకొనేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు కిమ్ జంగ్ ఉన్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రకటించారు. అయితే అదే సమయంలో దక్షిణ కొరియాతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నట్టు కూడ కిమ్ ప్రకటించడం శుభ పరిణామం. స్కూల్ లో చదువుకొనే సమయంలో కిమ్ ఎలా ఉండేవాడనే విషయమై ఆయన స్నేహితులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కిమ్ ను స్కూల్లో పాక్ యున్‌గా పిలిచేవారు
స్విట్జర్లాండ్‌లోని బెర్న్ ప్రాంతంలో ఉన్న జర్మన్ స్పీకింగ్ పాఠశాలలో కిమ్ చదువుకున్నారు.అయితే చిన్నప్పుడు కిమ్‌ను ఆయన స్నేహితులంతా పాక్ యున్ అంటూ సరదాగా ఆట పట్టించేవారు. ఈ మేరకు కొందరు స్నేహితులు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

బాస్కెట్‌బాల్ అంటే కిమ్‌కు ప్రాణం
బాస్కెట్ బాల్ అంటే ప్రాణమని స్నేహితులు చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా కిమ్ ఈ ఆటను ఆడేవారని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు. అయితే కిమ్ కేవలం 5 అడుగుల ఆరు అంగుళాలు మాత్రమే. తన ఎత్తును లెక్క చేయకుండా తనకు ఇష్టమైన ఆట ఆడేవాడని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు.

స్నేహితులతో సరదాగా ఉండేవాడు
కిమ్ జంగ్ ఉన్ తన స్నేహితులతో ఎప్పుడూ సరదాగా ఉండేవాడని వారు గుర్తు చేసుకొన్నారు. తమ దేశానికి ప్రత్యర్థి దేశాలకు చెందిన విద్యార్థులతో కూడ కిమ్ జంగ్ ఉన్ స్నేహంగా ఉండేవాడని వారు గుర్తు చేశారు.

ఓడిపోవడం నచ్చదు
కిమ్‌కు ఓడిపోవడం అస్సలు నచ్చదని అతని చిన్ననాటి స్నేహితులు గుర్తు చేశారు. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసేవాడని వారు చెప్పారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల ఒత్తిడికి గురయ్యేవాడని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు. కోపమెక్కువ, ఇతరులకు తన వల్ల ఇబ్బందులు ఎదురైనా కిమ్ జంగ్ పట్టించుకోడన్నారు. ఆడవారిపై కేకలు వేసేవాడని వారు గుర్తు చేసుకొన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications