యువనేత సోదరి 'యంగ్' రహస్యంగా నడిపిస్తున్నారా?
ప్యోంగ్యాంగ్: నార్త్ కొరియా డిక్టేటర్, యువనేత కిమ్ జంగ్ యన్ గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారని, దీంతో ఆయన సోదరి కిమ్ యో జంగ్ రహస్యంగా పాలన కొనసాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందనే వార్తలు వస్తున్నాయి. కిమ్ జంగ్ యన్ వయస్సు 31.
అతని సోదరి కిమ్ యో జంగ్ వయస్సు 27. కిమ్ జంగ్ యన్‌కు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. అందులో నలుగురు సవతి తల్లికి జన్మించిన వారు. ఇందులో కిమ్ యో జంగ్‌తో కిమ్ జంగ్ యన్‌కు నేరుగా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
దీంతో, అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె నార్త్ కొరియాను నడిపిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ అన్నాచెల్లెళ్లు ఇద్దరు కూడా ఒకే పాఠశాలలో చదివారు. స్విస్ బోర్డింగ్ పాఠశాలలో వారు చదువుకున్నారు.

2011లో కిమ్ జంగ్ II మృతి చెందడంతో కిమ్ జంగ్ యన్ బాధ్యతలు స్వీకరించారు. అతను ఇప్పుడు అస్వస్థతతో ఉన్నారని అంటున్నారు. అతను డయాబెటిస్ తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అయితే, అతని ఆరోగ్యం బాగా లేదనే వార్తలను నార్త్ కొరియన్ ప్రతినిధులు కొట్టిపారేశారు.
అతను పరానోయా, నర్కిసియం వంటి మానసిక వ్యాధులతోను బాధపడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కాగా, నార్త్ కొరియాకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ అక్టోబర్ 10వ తేదీన స్థాపించబడింది.
శుక్రవారం నాడు అక్టోబర్ 10 పార్టీ స్థాపించిన రోజు కూడా కిమ్ జంగ్ యన్ బయటకు రాకుంటే మరిన్ని ఊహాగానాలు చెలరేగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కిమ్ జంగ్ యన్ సెప్టెంబర్ 3న తన భార్యతో కలిసి ఓ కార్యక్రమంలో కనిపించారు. 2012లోను కూడా అతను ఓసారి ఇలాగే రెండు వారాల పాటు, ఎలాంటి సమాచారం లేకుండా పబ్లిక్‌లో కనిపించలేదు.












Click it and Unblock the Notifications