కిమ్‌ను చంపేందుకు సాయుధ బలగాలు, అంత ఈజీయా?

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ హత్యకు రంగం సిద్ధమవుతుందనే ప్రచారం సాగుతోంది. కిమ్‌ను రహస్యంగా హత్య చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందనే అభిప్రాయంతో ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం లేకపోలేదు. ఇటీవల దక్షిణ కొరియా రక్షణ మంత్రి కూడ ఇదే తరహ ప్రకటన చేశారు. సాయుధ బలగాలు ఉత్తరకొరియాలో దాడులకు దిగుతాయని చెప్పారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు ఎవరి మాటలు వినడం లేదు. ప్రపంచదేశాల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ అణుపరీక్షలను నిర్వహిస్తున్నాడు. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు చుక్కలు చూపిస్తున్నాడు.

కిమ్ చర్యలతో మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలున్నాయనే అనుమానాలు కూడ బలపడుతున్నాయి. ఈ తరుణంలో ఈ యుద్ద నివారణకు కిమ్‌ను లేకుండా చేయాలనే కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయనే ప్రచారం సాగుతోంది.

గతంలో కూడ ఉత్తరకొరియా అధ్యక్షుడి భవనంపై దక్షిణ కొరియా సాయుధ సేనలు దాడులు నిర్వహించిన ఘటనలు కూడ లేకపోలేదు. అయితే అప్పటి అధ్యక్షుడిని చంపేందుకు ఈ సేనలు విఫలయత్నం చేశాయి.

కిమ్‌ను చంపేందుకు దక్షిణ కొరియా వ్యూహం

కిమ్‌ను చంపేందుకు దక్షిణ కొరియా వ్యూహం

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఏ క్షణంలోనైనా సియోల్‌ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఎలెక్ట్రోమేగ్నటిక్‌ పల్స్‌ (ఈఎంపీ) దాడికి ఆదేశించే అవకాశం ఉందన్న భయం నేపథ్యంలో ఇక అతడిని చంపడంమే మార్గమని దక్షిణ కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గగన, ఉపరితల, జల మార్గాల ద్వారా ఏకకాలంలో కిమ్‌ ప్యాలెస్‌పై దాడి చేసి అతడిని హత్య చేయాలని భావిస్తున్నట్లు డెయిలీ స్టార్‌ తెలిపింది.

కిమ్‌ తీరు నచ్చని వారి సహయం

కిమ్‌ తీరు నచ్చని వారి సహయం

ఉత్తర కొరియాలోనే రక్షణ విధులు నిర్వహిస్తూ కిమ్‌ తీరు నచ్చని వారి సహాయంతో వారు కిమ్‌ ప్యాలెస్‌లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉత్తర కొరియా, అమెరికా మధ్య నేరుగా యుద్ధం తలెత్తే పరిస్థితి వచ్చిందని, దీని వల్ల ఏర్పడే నష్టాన్ని ఎదుర్కోనేందుకు బ్రిటన్‌ కూడా సిద్ధంగా ఉండాలంటూ అమెరికా ప్రభుత్వ మేథావులు సూచించారు.

కిమ్‌ను చంపడం చాలా రిస్క్‌తో కూడుకొంది

కిమ్‌ను చంపడం చాలా రిస్క్‌తో కూడుకొంది

కిమ్‌ను చంపాలనుకోవడం అంత ఆషామాషీ వ్యవహరం కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, ఓ బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ సీనియర్‌ అధికారి దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. అణుయుద్ధంకంటే ఇది మంచి ప్రత్యామ్నాయం అని పరోక్షంగా సమర్థించారు. అయితే ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న మిషన్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు.ఉత్తర కొరియా నియంతల ప్యాలెస్‌లోకి చేరుకోవడం అంటే ముమ్మాటికీ కఠినమేనని, మృత్యుకుహరంలోకి అడుగుపెట్టిననే ఆందోళన వ్యక్తం చేశారు.

న్యాయపరమైన చిక్కులు తప్పవా

న్యాయపరమైన చిక్కులు తప్పవా

కిమ్‌పై దాడి చేస్తే అంతర్జాతీయ న్యాయస్థానంలో చట్టపరంగా చిక్కులొచ్చిపడతాయని కూడా అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కిమ్‌ను అణు పరీక్షలు నిర్వహించడం నుంచి ఆపించాలని మరికొందరు సూచిస్తున్నారు. అతడి స్థానంలో మరో వ్యక్తిని తీసుకొచ్చేలా చూడాలని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు చైనాపై తీవ్ర ఒత్తిడి చేయగా ఆ దేశం మాత్రం నిరాకరిస్తూనే వస్తుంది.. ఒక వేళ నిజంగానే కిమ్‌ను హత్య చేసే ప్లాన్‌ ప్రారంభిస్తే అది కేవలం 40శాతం మాత్రమే విజయవంతం అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+