99.93 శాతం ఓటింగ్ తో గెలిచిన కిమ్ కాకా- ఆ 0.7 శాతం మంది పరిస్థితేంటో.. !!
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ నిర్వహిస్తోన్న జాయింట్ మిలటరీ ఆపరేషన్స్ 15వ రోజుకు చేరుకుంది. దీనికి ముగింపు మాత్రం కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌కు చెందిన వాళ్లే. లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి.
ఈ పరిణామాల మధ్య ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ జొంగ్ ఉన్ ఘన విజయం సాధించారు. అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఏకంగా 99.93 శాతం ఓట్లతో చరిత్ర తిరగరాసింది. వర్కర్స్ పార్టీ, దాని మిత్రపక్షం అభ్యర్థులు అన్ని పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారు. 15వ సుప్రీం పీపుల్స్ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీల ఎంపికకు ఈ నెల 15న ఉత్తర కొరియాలో ఈ ఎన్నికలు జరిగాయి. 99.99 శాతం పోలింగ్ నమోదు కాగా.. వర్కర్స్ పార్టీకి పడ్డ ఓట్లు 99.93.

ఎన్నికల అనంతరం నూతన అసెంబ్లీ.. తొలి సమావేశం ఒకట్రెండు రోజుల్లో ఏర్పాటు కానుంది. రాజ్యాంగ సవరణలు, కొత్త దేశ నాయకత్వ ఎన్నికలపై నిర్ణయాలు ఉంటాయి. గత నెలలో జరిగిన వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా తొమ్మిదవ కాంగ్రెస్ తర్వాత ఈ ప్లీనరీ ఏర్పాటు కానుంది. దేశ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఎన్నిక, సోషలిస్ట్ రాజ్యాంగ సవరణలు, అనుబంధాలను అసెంబ్లీ లాంఛనంగా ఆమోదిస్తుందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
దక్షిణ కొరియా పట్ల శత్రు వైఖరిని అధికారికంగా తీర్మానించే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ను తొలి అసెంబ్లీ సమావేశం ఆమోదిస్తుందని కేసీఎన్ఏ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన అంశాలను కూడా చర్చకు రావొచ్చు. అమెరికాకు వ్యతిరేక విధానాన్ని కొనసాగించడం, ఇరాన్ కు అనుకూలంగా వ్యవహరించేలా గతంలో తీసుకున్న ప్రాథమిక నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందని భావిస్తోంది. దేశ, విదేశీ సంబంధాలపై కిమ్ జొంగ్ ఉన్ కొత్త విధానాలను ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు.
అదే సెషన్‌లో కిమ్ జొంగ్ ను సుప్రీమ్ లీడర్గ గా, దేశ వ్యవహారాల కమిషన్ చీఫ్ గా తిరిగి ఎన్నుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తర కొరియాలో కిమ్ చెప్పిందే వేదం అయినప్పటికీ.. అక్కడి జాతీయ అసెంబ్లీని తరచూ సమావేశమౌతుంటుంది. అధికార పార్టీ నాయకత్వ నిర్ణయాలను చట్టబద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంటుంది. తన పదవీకాలం ఆరంభం నుండి 70 శాతానికి పైగా డిప్యూటీలను మార్చుతూ రావడం కూడా ఇందులో భాగమే.
ఈ ఎన్నికల్లో గెలిచిన 687 మంది డిప్యూటీలలో కిమ్ జాంగ్ చీఫ్ అడ్వైజర్ జో యాంగ్ వాన్ కూడా ఉన్నారు. అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియమితులు కావచ్చని అంచనా. మాజీ చైర్మన్ చోయ్ ర్యోంగ్ హే వైదొలిగారు. పార్టీ ప్లీనరీ సందర్భంగా ఆయనను పదవి నుండి తొలగించారు కిమ్. కొత్త జాబితాలో కూడా ఆయన లేరు. కిమ్ సోదరి కిమ్ యో-జోంగ్, విదేశాంగ మంత్రి చోయ్ సన్-హుయ్ కూడా కొత్తగా ఎన్నికైన డిప్యూటీలలో ఉన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications