ఈ ఆలోచన మీకెలా వచ్చింది.. మాకెందుకు రాలేదని సిగ్గు పడాలా ??
సోషల్ మీడియా స్టార్, బిలియనీర్ వ్యాపారవేత్త కిమ్ కర్దాషియాన్ స్థాపించిన షేప్‌వేర్ కంపెనీ SKIMS మరోసారి ఒక వివాదాస్పద ఉత్పత్తితో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. లేటెస్ట్ గా ఈ సంస్థ విడుదల చేసిన "ది అల్టిమేట్ బుష్ – ఫాక్స్ హెయిర్ పాంటీ" అనే ప్రత్యేక లోదుస్తుల సిరీస్ విడుదలైన కొద్ది గంటల్లోనే స్టాక్ అవుట్ అయ్యి సంచలనం సృష్టించింది.
ఉత్పత్తి విశేషాలు, ధర వివరాలు
ఈ వింత లోదుస్తుల సిరీస్‌లో ఫాక్స్ ప్యూబిక్ హెయిర్ స్ట్రింగ్ మైక్రో థాంగ్స్ ఉన్నాయి. ఒక్కో పాంటీ ధర 32 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.3,100)గా నిర్ణయించారు. అయితే ఇవి విడుదలైన కొద్ది గంటల్లోనే అన్ని ఉత్పత్తులు అమ్ముడైపోవడం హాట్ టాపిక్ గా మారింది.

SKIMS ప్రకారం ఇవి 12 విభిన్న రంగుల్లో లభిస్తున్నాయి. ఎరుపు, బ్లోండ్, బ్రూనెట్ షేడ్స్‌తో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కస్టమర్‌లు తమకు కావలసిన జుట్టు ఆకృతి ( నిటారుగా లేదా వంకరగా ) ఉండేలా ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఈ పాంటీ ముందు భాగంలో 82% పాలిమైడ్, 18% ఎలాస్టేన్ మిశ్రమంతో తయారు చేసిన పారదర్శక మెష్ ఫాబ్రిక్ ఉంటుంది. దీని పై భాగంలో ఫాక్స్ హెయిర్ లేయర్‌ను చేతితో అల్లడం ద్వారా డిజైన్ చేశారు.
"కార్పెట్ కలర్ మీ ఇష్టం"..
SKIMS ఈ ఉత్పత్తిని పూర్తిగా షాక్ విలువ (Shock Value) కలిగిన మార్కెటింగ్ స్టంట్‌గా పరిచయం చేసింది. తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. “ది అల్టిమేట్ బుష్ వచ్చేసింది! ఇప్పుడు మీ కార్పెట్ మీకు నచ్చిన రంగులో ఉండవచ్చు!”.. “కార్పెట్ డ్రేప్‌లకు సరిపోవాలని ఎవరు చెప్పారు? మా అత్యంత షాకింగ్ లోదుస్తులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.” అంటూ ప్రమోట్ చేస్తున్నారు.
కాగా కిమ్ కర్దాషియాన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో ఈ కొత్త పాంటీలను ప్రదర్శించి.. “ఇవి ఎంత ఫన్నీగా ఉన్నాయి! అని రాసుకొచ్చారు. ఆమె ప్రమోషన్ కారణంగానే ఈ ఉత్పత్తి కొన్ని గంటల్లోనే స్టాక్ అవుట్ అయ్యి, SKIMS చరిత్రలో అత్యధిక డిమాండ్ ఉన్న లోదుస్తుల సిరీస్‌గా రికార్డ్ సృష్టించింది.

ఇక ఈ ఉత్పత్తిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఎక్కువ మంది దీనిని విమర్శిస్తున్నప్పటికీ, కిమ్ మార్కెటింగ్ వ్యూహాన్ని ప్రశంసించిన వారు కూడా ఉన్నారు. SKIMS నుంచి ఇలాంటి వివాదాస్పద ఉత్పత్తి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కిమ్ రూ.4,000 విలువైన “ఫేస్ షేప్‌వేర్”**ను విడుదల చేసి, అది నిద్రలో కూడా దవడ రేఖను బిగుతుగా ఉంచుతుందని పేర్కొని చర్చకు దారితీసింది. ఈ వినూత్న మార్కెటింగ్ వ్యూహాల కారణంగానే 2024 నాటికి SKIMS కంపెనీ విలువ $4 బిలియన్లు (రూ.33,000 కోట్లకు పైగా) దాటింది.












Click it and Unblock the Notifications