లాక్ డౌన్‌లోనూ.. సెక్స్ వర్కర్లపై భోగ పురుషుల ఒత్తిళ్లు.. కరోనా సోకిందని చెప్తే షాకింగ్ రిప్లై..

కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకలికి అలమటిస్తూనే లాక్ డౌన్‌కి సహకరిస్తున్నవారు కొందరైతే.. భద్ర జీవితం గడుపుతూ వ్యక్తిగత సుఖాల కోసం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాలని చూస్తున్నవారు మరికొందరు. లాక్ డౌన్ వేళ పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే.. చాలామంది సెక్స్ వర్కర్లు ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తున్నారు. కానీ కొంతమంది భోగ పురుషులు మాత్రం.. లాక్ డౌన్ పీరియడ్‌లోనూ 'సెక్స్' కోసం సెక్స్ వర్కర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆ భోగ పురుషుల పిచ్చి ఏ స్థాయిలో ఉందో న్యూజిలాండ్‌కి చెందిన ఓ సెక్స్ వర్కర్ బయటపెట్టింది.

లాక్ డౌన్ పీరియడ్‌లోనూ భోగ పురుషుల ఒత్తిళ్లు..

లాక్ డౌన్ పీరియడ్‌లోనూ భోగ పురుషుల ఒత్తిళ్లు..

న్యూజిలాండ్‌లోని తౌరంగాకు చెందిన ఓ సెక్స్ వర్కర్(40) వాట్సాప్‌కు లాక్ డౌన్ పీరియడ్‌లోనూ ప్రతీరోజూ 6 లేదా 7 రిక్వెస్టులు వస్తున్నాయి. వీళ్లంతా తమకు సెక్స్ కావాలని ఆమెకు మెసేజ్‌లు పెడుతున్నారు. అయితే రాబోయే కొద్ది వారాల వరకు అలాంటివేమీ కుదరవని.. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రూల్స్ పాటించాల్సిందేనని ఆమె వారికి రిప్లై ఇస్తోంది. అయినా సరే,వాళ్లెవరూ ఆమె మాటలను చెవికెక్కించుకోవడం లేదు. సరికదా,పదేపదే మెసేజ్‌లు పెడుతూ విసుగు తెప్పిస్తున్నారు.

కరోనా సోకిందని చెప్తే.. షాకింగ్ రిప్లై..

కరోనా సోకిందని చెప్తే.. షాకింగ్ రిప్లై..

ఇటీవల ఓ వ్యక్తి కూడా ఇలాగే తనకు వాట్సాప్ మెసేజ్ పంపించాడని ఆ సెక్స్ వర్కర్ చెప్పింది. అయితే తనకు కరోనా వైరస్ సోకిందని చెప్పినా.. తనతో సెక్స్ చేసేందుకు అదేమీ అడ్డం కాదని అతను రిప్లై ఇచ్చాడని చెప్పింది. ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా తాను షాక్ తిన్నానని.. లాక్ డౌన్ పట్ల వీళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధపడ్డానని చెప్పింది. తానో నో చెప్పగానే.. మరో సెక్స్ వర్కర్‌ను సంప్రదిస్తున్నారని.. అంతే తప్ప లాక్ డౌన్ వేళ ఇలాంటివన్నీ మానుకోవాలని మాత్రం వారు ఆలోచించడం లేదని పేర్కొంది.

న్యూజిలాండ్‌లో సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ భృతి..

న్యూజిలాండ్‌లో సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ భృతి..

బయటిదేశాల్లో పరిస్థితులను చూస్తుంటే తనకు భయం కలుగుతోందని.. కాబట్టి మన దేశం(న్యూజిలాండ్) కరోనా బారి నుంచి బయటపడాలంటే లాక్ డౌన్ పాటించాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించింది. నిజానికి ఆ సెక్స్ వర్కర్‌ ఆదాయ మార్గం వ్యభిచారం మాత్రమే. ఆ వృత్తితోనే వారానికి 1600 డాలర్లు సంపాదించేది. అయితే కరోనా లాక్ డౌన్ వేళ ప్రభుత్వం ఆమెకు 585 డాలర్ల భృతిని అందిస్తోంది. న్యూజిలాండ్‌లో వ్యభిచారం చట్టబద్దం కాబట్టి.. ఆమె లీగల్‌ గానే సెక్స్ వర్కర్‌గా కొనసాగుతోంది కాబట్టి ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు పూర్తి అవసరాలను తీర్చలేకపోయినా.. తనకున్న సేవింగ్స్‌తో నెట్టుకొస్తున్నానని ఆమె వెల్లడించింది.

Recommended Video

    Case Filed On Chandrababu Naidu's PA By YSR Congress Party Workers
    లాక్ డౌన్ పట్ల సెక్స్ వర్కర్ల నిబద్దత..

    లాక్ డౌన్ పట్ల సెక్స్ వర్కర్ల నిబద్దత..


    ప్రాస్టిట్యూట్స్ కలెక్టివ్ నేషనల్ కోఆర్డినేటర్ డేమ్ కేథరిన్ దీనిపై మాట్లాడుతూ సెక్స్ వర్కర్లపై కస్టమర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోందన్నారు. 'ఈ దేశంలో పదుల సంఖ్యలో ప్రజలు సెక్స్ కోసం ఖర్చు చేస్తారు. ఇప్పుడు కూడా నిరంతరాయంగా సెక్స్ వర్కర్లపై వారు ఒత్తిడి తెస్తున్నారు. కానీ అదృష్టవశాత్తూ, ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు లాక్ డౌన్ పట్ల నిబద్దతతో వ్యవహరిస్తున్నారు.' అని కేథరిన్ చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+