Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NRI News: మీరు అమెరికాలో ఉంటున్నారా? ఇండియన్ పాస్ పోర్ట్ ఇలా రెన్యువల్ చేస్కోండి!

Indian Passport: భారతదేశం నుంచి ప్రజలు నిరంతరం అమెరికాకు వెళ్లేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం అమెరికాలో సెటిల్ అయ్యారు. చాలా మంది విద్యార్థులు అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి ఆ తర్వాత ఏదైనా జాబ్ చేస్తూ యూఎల్ లోనే స్థిరపడాలని చూస్తుంటారు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే చాలా మంది అమెరికాలో స్థిరపడిన సంగతి తెలిసిందే.

అలా అమెరికాలో స్థిరపడిన చాలా మంది ఎన్ఆర్ఐలు ఇండియన్ పాస్‍పోర్ట్ కలిగి ఉంటారు. అయితే ఇండియన్ పాస్‍పోర్ట్ 10 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ గడువు నాటికి రెసిడెంట్ ఇండియన్లతో పాటు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా తమ పాస్‌పోర్టులను చట్టప్రకారం తిరిగి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడం, తిరిగి జారీ చేయడం వంటి ప్రక్రియలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. ఎవరైనా వ్యక్తి పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నప్పుడు మాదిరిగానే.. దరఖాస్తుదారు తప్పనిసరిగా పునరుద్ధరణ లేదా రీఇష్యూ ప్రక్రియను ప్రారంభించే ముందు తప్పనిసరిగా FIRని ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగియడం, వ్యక్తిగత సమాచారాన్ని నవీకరించాల్సిన అవసరం వంటి వివిధ కారణాల వల్ల రెన్యూవల్ కోసం అభ్యర్థించవచ్చు. ఇలా చేసిన ప్రతిసారి కొత్త పాస్‌పోర్ట్ నంబర్, బుక్‌లెట్ నంబర్ వస్తుంది.

Know how non Resident Indians can Renew their Indian Passport from Foreign country

ఇండియాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు పాస్‍పోర్ట్ సేవా వెబ్‍సైట్ లో ఫ్రెష్ పాస్‍పోర్ట్ లేదా రీఇష్యూ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పూరించాలి. దీనిని ఎందుకు అభ్యర్థిస్తున్నారో కూడా అందులో వివరించాల్సి ఉంటుంది. దీని తర్వాత తగిన రుసుము చెల్లించి దగ్గరలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లలో అపాయింట్మెంట్ తేదీన కేంద్రానికి వెళితే అక్కడ అధికారులు అభ్యర్థి ఫొటోలు, బయోమెట్రిక్స్ సహా అవసరమైన డాక్యుమెంట్లు తీసుకుంటారు. దీని తర్వాత పోలీస్ వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది. ఈ క్రమంలో పాత పాస్ పోర్ట్, విద్యార్హత సర్టిఫికెట్లు, అడ్రస్ ప్రూఫ్, విదేశీ అడ్రస్ వంటివి అవసరం ఉంటుంది.

అయితే విదేశంలో ఉన్న భారతీయ పౌరుడు తమ ఇండియన్ పాస్‍పోర్ట్ అక్కడి నుంచే ఎలా రెన్యూవల్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం భారతదేశానికి తిరిగి రాలేని NRIల కోసం, వారి నివాసం ఉంటున్న విదేశం నుంచి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీకు దగ్గరలోనికాన్సులర్ అధికార పరిధి కేంద్రాలను గుర్తించండి. విదేశీ ప్రయాణ మంత్రిత్వ శాఖలతో సహకరిస్తున్న VFS గ్లోబల్ ద్వారా పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. ఈ క్రమంలో కొన్ని డాక్యుమెంట్లకు నోటరీ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజులు వేరువేరు దేశాల్లో మారుతుంటుంది. ఈ సెంటర్లలో డబ్బు రూపంలో చెల్లింపు చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు అవసరమైన సమయం లొకేషన్, పోలీసు క్లియరెన్స్ అవసరమా అనే దాని ఆధారంగా మారవచ్చు. సాధారణంగా 3-8 వారాల సమయం ఇందుకోసం పడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+