US Visa: భారత్‍లో విచ్చలవిడిగా యూఎస్ వీసా మోసాలు.. ఇలా గుర్తించండి..?
US Visa Fraud: అమెరికా వెళ్లాలని వెంపర్లాడే ఇండియన్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఒకపక్క అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన వేళ అమెరికా వెళ్లి స్థిరపడటం కష్టతరంగా మారుతుందని చాలా మంది భావిస్తున్నారు. కొందరు మోసగాళ్లు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. మోసగాళ్లు ఏజెన్సీ అధికారులను మోసగించే స్కామ్‌ల పెరుగుదలకు సంబంధించి విదేశీ పౌరులకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ హెచ్చరిక జారీ చేసింది. ఈ-మెయిల్, ఫోన్ ద్వారా జరుగుతున్న మోసపూరిత పద్ధతులను హైలైట్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యర్థులను లేదా విదేశీ పౌరులను సోషల్ మీడియా ద్వారా సంప్రదించబోమని ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది. తాము కేవలం అధికారిక పద్ధతులను మాత్రమే ఈ విషయంలో పాటిస్తామని పేర్కొంది. అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవాలని కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్న స్కామ్‌లలో భారీ పెరుగుదల నమోదైందని ఇందులో పేర్కొన్నారు.

నవంబర్ 2024లో H-1B వీసాలు పొందేందుకు నకిలీ జాబ్ ఆఫర్‌లతో కూడిన మోసపూరిత స్కీమ్‌కి సంబంధించి భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులపై అభియోగాలు మోపారు. నిందితులు USCISకి ఉద్యోగ వివరాలు, జీతాలను తప్పుగా సూచిస్తూ తప్పుడు పిటిషన్లను సమర్పించారని అభియోగాలు ఉన్నాయి. ఒకవేళ నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీనికి ముందు సెప్టెంబరులో లూథియానాలో వీసా స్కామ్ బయటపడింది. ఇక్కడ మోసగాళ్లు అమెరికా సంస్థల ప్రతినిధులుగా నటించారు. వీసా ప్రాసెసింగ్ కోసం పెద్ద మొత్తంలో చెల్లించమని బాధితులను ఒప్పించారు.
2024 ప్రథమార్థంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 108 మంది మోసపూరిత ఏజెంట్లను అరెస్టు చేయడంతో దిల్లీ పోలీసులు మోసంలో గణనీయమైన పెరుగుదలను నివేదించారు. ఈ పెరుగుదల విదేశీ ప్రభుత్వాల నుండి ఎక్కువ పరిశీలనకు, భారతీయ దరఖాస్తుదారులకు కఠినమైన వీసా నిబంధనలకు దారితీసింది. ఇమ్మిగ్రేషన్ విషయాలపై చట్టపరమైన సలహాను న్యాయవాదుల నుంచి తెలుసుకోవాలని కోరింది.
స్కామ్‌ను ఎలా గుర్తించాలి?
- చట్టబద్ధంగా కనిపించే ఇమెయిల్‌లు తెలియని మూలాల నుండి వచ్చినవి.
- అధికారిక .gov డొమైన్‌కు బదులుగా .net లేదా .org వంటి అసాధారణ డొమైన్ ముగింపులను కలిగి ఉన్న ఇమెయిల్‌లను నమ్మెుద్దు.
- రుసుము లేదా స్పీడ్ ప్రాసెసింగ్ వాగ్దానాల కోసం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఆఫర్‌లను నమ్మెుద్దు.
- వ్యక్తులకు నిధులను బదిలీ చేయడానికి లేదా అధికారిక myUSCIS ఖాతా వెలుపల రుసుము చెల్లించాలని మోసగాళ్లు కోరుతుంటారు.
ఒకవేళ మోసానికి గురైతే.. ఇమ్మిగ్రేషన్ స్కామ్‌ను ఎదుర్కొన్నట్లు అనుమానించే వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (FTC)కి నివేదించమని ప్రోత్సహిస్తారు. బాధితులు స్థానిక లేదా రాష్ట్ర అధికారులను కూడా అప్రమత్తం చేయవచ్చు. స్కామ్‌ను నివేదించడం చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్‌లు లేదా పిటిషన్‌లను ప్రతికూలంగా ప్రభావితం చేయదని USCIS ప్రజలకు వెల్లడించింది.












Click it and Unblock the Notifications