మిస్ యూనివర్స్ పోటీలు: కారు బీభత్సం, ఒకరి మృతి
లాస్ వేగాస్: అమెరికాలోని లాస్ వేగాస్ నగరంలో ఒకే రోజు రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. మిస్ యూనివర్స్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అదే సమయంలో నగరంలోని ప్రసిద్ది చెందిన హోటల్ ముందు కారు బీభత్సం సృష్టించింది.
సంఘటనా స్థలంలో ఒకరు దుర్మరణం చెందారు. 37 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి లాస్ వేగాస్ నగరంలో మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి.
లాస్ వేగాస్ నగర ప్రజలు రోడ్ల మీద ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద స్క్రీన్ల మీద మిస్ యూనివర్స్ అవార్డు వేడుకలు తిలకిస్తున్నారు. అదే సమయంలో నగరంలోని పారిస్ హోటల్ దగ్గర ఓ కారు పాదచారుల మీదకు దూసుకు వెళ్లింది.

ఒకరు అక్కడికక్కడే మరణించగా పిల్లలు, మహిళలు, వృద్దులతో సహ 37 మందికి తీవ్రగాయాలైనాయి. వెంటనే పోలీసులు బాధితులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి కారణం అయిన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉగ్రవాదులు దాడులు చేస్తారని భయంతో ఉన్న అమెరికా ప్రజలు ఈ ఘటనతో హడలిపోయారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేక ప్రమాదమా అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన కారు డ్రైవర్ పేరు చెప్పడానికి అధికారులు నిరాకరించారు.












Click it and Unblock the Notifications