పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి..! 91 డ్రోన్లతో..

రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్ల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో ఈ చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రష్యా విదేశాంగ మంతి ఉక్రెయిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక భవనంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందని అన్నారు. నోవ్ గొరోడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసంపై దాడికి ఉక్రెయిన్ ప్లాన్ చేసిందన్నారు. అయితే ఆ సమయంలో పుతిన్ ఆ భవనంలో ఉన్నారా..? లేరా..? అనడానికి ఆధారాలు లేవని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ తప్పు బట్టింది.

రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. ఉక్రెయిన్ పై కీలక ఆరోపణలు చేశారు. నోవ్ గొరోడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందని అన్నారు. ఇది స్టేట్ టెర్రరిజం అని వ్యాఖ్యానించారు లావ్రోవ్. పుతిన్ అధికారిక నివాసం పైకి 91 డ్రోన్ లతో ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్ వేసిందని వివరించారు. అయితే ఈ డ్రోన్ లను రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా నేలకూల్చిందని తెలిపారు. రష్యన్ స్టేట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక ఉక్రెయిన్ ఇలాంటి దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తిరిగి దీటుగా బదులు చెప్తామని అన్నారు. ఇప్పటికే రష్యన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకునేందుకు ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను గుర్తించిందని కౌంటర్ స్ట్రైక్స్ కు సమయం నిర్ణయించిందని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు తాము చూస్తూ ఊరుకోమని అన్నారు. దాంతో మరోసారి రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరగనున్నట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు ఈ దాడులను ఉక్రెయిన్ ఖండించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు లావ్రోవ్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ తప్పు బట్టినట్లు సమాచారం.

Lavrov Bombshell Ukraine Sent 91 Drones to Strike Putin s Novgorod Residence

మరోవైపు ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు సఫలీకృతం అవుతున్నట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ కు అమెరికా దాదాపు 15 ఏళ్లపాటు సెక్యూరిటీని కల్పించనున్నట్లు తెలుస్తోంది. రష్యా భూ ఆక్రమణను నిరోధించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా భద్రతను ఇస్తుందని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే ఈ 15 ఏళ్లపాటు కాకుండా 50 ఏళ్ల పాటు అమెరికా భద్రత ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభిప్రాయపడినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+