'మత స్వేచ్చ'లో జోక్యం: ట్రంప్ మరో బాంబు పేల్చబోతున్నారా?

ఇదే గనుక జరిగితే.. అమెరికాలో సేవలన్ని మతంతో ముడిపడటం ఖాయం. ఉద్యోగాలు, సేవలు, ఇతరత్రా సామాజిక ప్రయోజనాలు.. ఇలా ప్రతీది మత ప్రాతిపదికన విడివడే ప్రమాదం పొంచి ఉంది.

వాషింగ్టన్: వివాదస్పద నిర్ణయాలతో తన అధ్యక్ష ప్రయాణాన్ని మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రానున్న రోజుల్లో మరిన్ని వివాదస్పద నిర్ణయాలు తీసుకోబోతున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన ట్రంప్.. మరో బాంబు పేల్చే యోచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 'మ‌త స్వేచ్ఛ‌ను గౌర‌వించేందుకు ప్ర‌భుత్వ చొర‌వ' పేరుతో త్వరలోనే ఓ ముసాయిదా ఆదేశానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారనేది ప్రస్తుతం అక్కడి మీడియా నుంచి బలంగా వినపడుతోన్న ఊహాగానం.

Leaked Draft of Trump’s Religious Freedom Order Reveals Sweeping Plans to Legalize Discrimination

ఇదే గనుక జరిగితే.. అమెరికాలో సేవలన్ని మతంతో ముడిపడటం ఖాయం. ఉద్యోగాలు, సేవలు, ఇతరత్రా సామాజిక ప్రయోజనాలు.. ఇలా ప్రతీది మత ప్రాతిపదికన విడివడే ప్రమాదం పొంచి ఉంది. అమెరికాలో మెజారిటీ వ్యక్తులు క్రిస్టియన్స్ గనుక.. క్రిస్టియన్స్ కానీ వ్యక్తులకు ఉద్యోగాలు, సేవలు నిరాకరించే ప్రమాదముంది.

మొత్తంగా ఈ నిర్ణయం క్రైస్తవ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగానే ఉంది. 'కొన్ని రకాల సేవలు అందించడానికి మతపరమైన అభ్యంతరాలున్నాయి. కావునా వాటికి చట్టపరమైన రక్షణ కల్పించాలి' అని అమెరికాలోని మితవాద క్రైస్తవులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ గనుక మతస్వేచ్చలో జోక్యం చేసుకుంటే.. వారికి ప్రయోజనం కలిగే అవకాశముంది.

కాగా, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే మ‌త స్వాతంత్ర్యం, గే హ‌క్కుల త‌దిత‌రాల‌పై మ‌రోమారు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వైట్‌హౌస్ సెక్ర‌ట‌రీ సీన్ స్పైస‌ర్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపారేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+