కొత్త తరహా యుద్ధం: రక్తసిక్తం- వేలాదిమంది టెర్రరిస్టుల పని ఖతం

Lebanon Pagers blast: లెబనాన్‌‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. పేజర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో 10 మంది హెజ్బొల్లా ఉగ్రవాదులు, సానుభూతిపరులు దుర్మరణం పాలయ్యారు. 4,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న స్థితిలో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు.

వారిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ ఘటనతో మధ్య- తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడుకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమంటూ లెబనాన్ మండిపడుతోంది.

Lebanon Pagers blast 10 killed and over 4000 of Hezbollah terrorists their affiliates injured

తొలుత రాజధాని బీరుట్ దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టుండి పేజర్లు పేలిపోయాయి. హెజ్బొల్లాకు గట్టిపట్టు ఉన్న ప్రాంతం ఇది. ఆ తరువాత దేశవ్యాప్తంగా పలు చోట్ల పేజర్ల పేలుళ్లు సంభవించాయి. వరుసగా ఒక్కో ప్రాంతంలో అనుమానాస్పద మెసేజ్ అందుకున్న ప్రతి పేజర్ కూడా భారీ శబ్దం చేస్తూ పేలిపోయాయి. మొత్తంగా 1,500లకు పైగా పేజర్లు పేలిపోయినట్లు లెబనాన్ వెల్లడించింది.

ఈ ఘటనలో పేజర్ల యూజర్లు, ఆ సమయంలో వారితో పాటు ఉన్న వాళ్లు, సానుభూతిపరులు.. ఇలా 4,000 మందికి పైగా గాయపడ్డారు. తొమ్మిది మంది సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గాయపడ్డ వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. చాలినన్ని అంబులెన్సులు లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనాలు, టూవీలర్లు.. ఇలా అందుబాటులో వాహనాల్లో వాళ్లను ఆసుపత్రులకు తరలించారు. చికిత్స అందిస్తోన్నారు. గాయపడ్డ వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటన పట్ల లెబనాన్ ఘాటుగా స్పందించింది. దీనికి ఇజ్రాయెల్ కారణమంటూ ఆరోపించింది. ఇజ్రాయెల్ చేపట్టిన సైబర్ దాడిగా అభివర్ణించింది. తమ దేశ సెక్యూరిటీ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఇజ్రాయెల్ వ్యవహరించిందంటూ మండిపడింది. ఆ దేశాన్ని ఉగ్రవాదిగా పేర్కొంది.

ఈ దాడికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని లెబనాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా బౌ హబీబ్ విమర్శించారు. దీనికి తగిన శిక్షను అనుభవించక తప్పదంటూ హెచ్చరించారు. తమ దేశంపై సైబర్ దాడికి పాల్పడిందంటూ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+