లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..
ప్రముఖ జర్నలిస్ట్, లెజండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ చనిపోయారు. ఆయన సీఎన్ఎన్ న్యూస్ చానెల్ హోస్ట్‌గా చాలా ఏళ్లు పనిచేశారు. 'ల్యారీ కింగ్ లైవ్' అనే షో 25 ఏళ్ల పాటు నడిచింది. అధ్యక్ష అభ్యర్థులు, సెలబ్రిటీస్, అథ్లెట్స్, సినీ తారలను, సాధారణ ప్రజలను ఆయన ఇంటర్వ్యూ చేశారు. 2010లో తన షోకు ల్యారీ గుడ్ బై చెప్పారు. 25 ఏళ్లలో 6 వేల ఎపిసోడ్స్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.

ల్యారీ అనారోగ్యంతో శనివారం ఉదయం చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాన్స్ ధృవీకరించారు. తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్ట్ కూడా చేశారు. కో ఫౌండర్, హోస్ట్, స్నేహితుడు ల్యారీ కింగ్ చనిపోయారని ఓరా మీడియా ప్రకటనలో తెలిపింది. ఆయన లాస్ ఏంజెల్స్‌లో గల సెడార్స్ సినాల్ మెడికల్ సెంటర్‌లో చనిపోయారని వెల్లడించింది. రెడియో, టీవీ, డిజిటల్ మీడియాలో ల్యారీ మంచి పేరు గడించారు. వేలాది ఇంటర్వ్యూలు చేసి మన్ననలు పొందారు. అవార్డులను అందుకున్నారు.
ల్యారీ మృతికి గల కారణం తెలియరాలేదు. ఎవరూ కూడా ఈ సమస్యతో చనిపోయారని ప్రకటించలేదు. అయితే వృద్దాప్య దశకు చేరుకొని.. 87 ఏళ్ల వయస్సులో సాధారణంగానే చనిపోయారని తెలుస్తోంది. గత డిసెంబర్ నెలలో ల్యారీకి కరోనా కూడా సోకింది. ల్యారీ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications