వైట్ హౌస్‌కు సైనేడ్ పూసిన లెటర్, ఒబామాను చంపేందుకేనా..?
అమెరికాలోని వైట్ హౌస్ కార్యాలయానికి వచ్చిన ఒక లెటర్ కలకలం రేపుతోంది. ఈ వారంలో వచ్చిన ఓ కవర్ సైనేడ్ పాజిటివ్ అని తేలినట్టు అమెరికా మీడియా తెలిపింది. "ఈనెల 16 (ఆదివారం)న వైట్ హౌస్ లేఖల పరిశీలన విభాగానికి ఒ ఎన్వలప్ కవర్ వచ్చింది. ప్రాథమిక బయోలాజికల్ పరీక్షలో నెగిటివ్ అని తేలింది. మళ్లీ తర్వార రోజున రసాయన పరీక్షలో సైనేడ్ పాజిటివ్ అని స్పష్టమైంది" అని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి బ్రియాన్ లియరీ ఓ ప్రకనటలో తెలిపారు.

ఆ సైనేడ్ పరీక్షను ధ్రువీకరించుకునేందుకు అదే శాంపిల్‌ను మరో చోటకు పంపామని తెలిపారు. ఆ సైనేడ్ లెటర్ ఎక్కడనుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ దేశాల నుంచి అధ్యక్షుడికి చంపేందుకు కుట్రలో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటి వస్తూనే ఉంటాయని అన్నారు.
జూన్ 2013లో కూడా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు ఫ్యామిలీని చంపుతానంటూ వెస్ట్ వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి లెటర్ రాసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications