‘జార్విస్’ లాంటి సహాయకుడు కావాలి: జుకర్‌బర్గ్
న్యూయార్క్: ఈ ఏడాది(2016) తాను సాధించాల్సిన లక్ష్యం ఒకటి ఉందంటూ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్. ప్రతి ఏడాది సరికొత్త లక్ష్యాలు పెట్టుకోవడం తనకు అలవాటని జుకర్ తెలిపారు.
అలాగే ఈ ఏడాది కూడా తాను ఏదో ఒకటి సాధించాలని.. అది పది మందికి ఉపయోగపడేది అయితే మరింత ఆనందాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది తాను ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ బట్లర్‌ను తయారుచేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఇంట్లోనూ, ఆఫీసులోనూ తన పనికి సహాయపడేలా ఈ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఐరన్‌మ్యాన్ సినిమాలో ‘జార్విస్'లా ఆ పాత్ర ఉంటుందని జుకర్‌బర్గ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికత సాయంతో తానే ఈ పాత్రను సృష్టించుకోనున్నట్లు మార్క్ వెల్లడించారు.
ఇంట్లో లైట్లు వేయడం, గది ఉష్ణోగ్రత నియంత్రించడం, సంగీతం పెట్టడం, మిత్రులు వస్తే వారి ముఖాలు గుర్తుపట్టి లోనికి ఆహ్వానించడం... లాంటివన్నీ తన కొత్త సహాయకుడు చేసి పెట్టాలని మార్క్ ఆకాంక్షిస్తున్నారు. ఇది తనకొక సవాల్ అని జుకర్ బర్గ్ అన్నారు. కాగా, గతంలో నెలలో 2 పుస్తకాలు చదవడం, మాండరీన్ నేర్చుకోవడం వంటివి నిర్దేశించుకుని పూర్తి చేశారు జుకర్ బర్గ్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications