ప్రపంచ అత్యంత ధనిక మహిళ మృతి: ఆమె సంపదెంతో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ లిలియానే బెటెన్ కోర్ట్(94) గురువారం కన్నుమూశారు. ఈ మేరకు వివరాలను ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ లోరియల్‌కు ఆమె వారసురాలు.
లండన్: ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళ లిలియానే బెటెన్ కోర్ట్(94) గురువారం కన్నుమూశారు. ఈ మేరకు వివరాలను ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ లోరియల్‌కు ఆమె వారసురాలు. కంపెనీ వ్యవస్థాపకుడు యూజీన్ షుల్లెర్‌కు బెటెన్ కోర్టు కూతురు. ఫోర్బ్స్, బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లలో బెటెన్ కోర్ట్ ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా పేరు దక్కించుకున్నారు.
లిలియానే నికర సంపద సుమారు 44 బిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే మన దేశీయ కరెన్సీలో చెప్పుకోవాలంటే.. రూ.2,85,980కోట్లకుపైమాటే. ప్రస్తుతం బెటెన్ కోర్ట్ కుటుంబానికి లోరియల్ గ్రూప్‌లో 33శాతం వాటా ఉంది. కాగా, లిలియానే 1922లో లోరియల్ కంపెనీకి అధినేత్రి అయ్యారు.

ఈ కాస్మోటిక్ దిగ్గజ కంపెనీలో సొంత చురుకుగా పనిచేస్తూ.. 2012 వరకు ఆమె కంపెనీ బోర్డులోనే పనిచేశారు. 89ఏళ్ల వయసులో ఆమె తన పదవి నుంచి దిగిపోయారు. తన కూతురుతో నెలకొన్న న్యాయ వివాద నేపథ్యంలో ఆమె తన మనవడికి లోరియల్ సంస్థ బాధ్యతలను అప్పగించారు.
1950లో ఫ్రెంచ్ రాజకీయవేత్త ఆండ్రె బెటెన్ కోర్ట్‌ను వివాహమాడిన ఆమె.. 1960, 70లలో ఫ్రెంచ్ కేబినెట్ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. కాగా, లిలియా మృతితో ఆమె కూతురుతో సహా కుటుంబసభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.












Click it and Unblock the Notifications