విషాదం: పార్కులో సింహం దాడి, యువతి మృతి

జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని ఓ పార్కులో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా పార్క్‌కు వెళ్లిన యువతి.. సింహం బారినపడి ప్రాణాలు కోల్పోయింది. సింహం దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్ లోని వన్యప్రాణుల పార్క్ చూసేందుకు అమెరికాకు చెందిన ఓ యువతి వెళ్లింది. కాగా, ఈ పార్క్‌లో సింహాలను బంధించకుండా స్వేచ్చగా వదిలేస్తారు. కార్లు, ఇతర వాహానాలలో వెళ్లి వీటిని చూడవచ్చు.

అమెరికా యువతి కారులో వెళ్లి సింహాలను చూస్తూ సరదగా ఫొటోలు తీయసాగింది. ఆ సమయంలోనే కారు అద్దాలు వేసుకోకపోవడంతో సింహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను రక్షించేందుకు కారు డ్రైవర్ ప్రయత్నించగా అతణ్ని కారు గోళ్లతో గాయపరిచింది.

Lion kills US woman tourist at South Africa lion park

గమనించిన పార్క్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై సింహాన్ని అక్కడి నుంచి తరిమేశారు. హుటాహుటిన అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి తరలించారు. సింహం దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి మృతి చెందగా, డ్రైవర్ చికిత్స పొందతున్నాడు.

పార్క్ తిలకించేందుకు వచ్చేవారికి తగిన జాగ్రత్తలు తెలియజేస్తామని పార్కు సిబ్బంది తెలిపారు. కారు అద్దాలు వేసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. కాగా, ఈ పార్కులో గత నాలుగు నెలల్లో ఇది మూడో దాడి కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+