ఇస్లామిక్ స్టేట్ వీడియోలు చూసి తల్లిని చంపేసింది

డెన్మార్క్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల అరాచకాలకు ఆకర్షితురాలైన బాలిక తన ప్రియుడితో కలిసి కన్న తల్లిని అతి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన డెన్మార్క్ నగరంలో జరిగింది. తల్లిని హత్య చేసిన బాలిక కటకటాలపాలైయ్యింది.

లిసా బోర్చ్ (15), ఆమె ప్రియుడు బక్తియర్ మహమ్మద్ (29) అనే ఇద్దరికి జైలు శిక్ష పడిందని డెన్మార్క్ పోలీసు అధికారులు తెలిపారు. హోల్డెగార్డ్ అనే మహిళ తన భర్త జెన్స్, ఇద్దరు కవలపిల్లలతో కలిసి డెన్మార్క్ నగరంలో నివసిస్తోంది.

హోల్డెగార్డ్ కుమార్తె ఈ లిసా. ఇరాక్ కు చెందిన బక్తియర్ మహమ్మద్ శరణార్థిగా డెన్మార్క్ నగరానికి వలస వెళ్లాడు. ఇతనితో లీసా ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న హోల్డెగార్డ్ తన కుమార్తె లిసా ప్రేమను వ్యతిరేకించింది.

Lisa Borch planned to join ISIS with her Iraqi boyfriend after the killing

అప్పటి నుంచి లిసా తన తల్లితో నిత్యం గొడవపడుతున్నది. తల్లి మీద కక్ష పెంచుకుంది. తరువాత బక్తియర్ మహమ్మద్ తో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాల వీడియో క్లిప్పింగ్ లు చూసింది.

మహమ్మద్ తో కలిసి సిరియా వెళ్లి ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాటం చెయ్యాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. 2014 అక్టోబర్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బ్రిటీష్ జాతీయులు డేవిడ్ హెన్స్, అలెన్ హెన్నింగ్ తలలను నరికివేసిన దృశ్యాల వీడియోను పదేపదే చూసింది.

అనంతరం లిసా ప్రియుడితో కలిసి వంటగదిలో ఉన్న కత్తి తీసుకుని తల్లి హోల్డెగార్డ్ ను 20 సార్లు పొడిచి దారుణంగా హత్య చేసింది. పోలీసులకు ఫోన్ చేసి తన తల్లిని ఓ వ్యక్తి కత్తితో పోడిచి పారిపోయాడని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

విచారణలో వంట గదిలో వేలిముద్రలు గుర్తించారు. ఆ వేలిముద్రలు బక్తియర్ మహమ్మద్ వేలిముద్రలు సరిపోయాయి. అదే సమయంలో లీసా, మహమ్మద్ ప్రేమ వ్యవహారం బయటపడింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

కేసు విచారణ చేసిన డెన్మార్క్ న్యాయస్థానం ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన లిసాకు తొమ్మిదేళ్లు, ఆమె ప్రియుడు బక్తియర్ మహమ్మద్ కు 13 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తి అయిన తరువాత బక్తియర్ ను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+