షాకింగ్ : హోమ్ వర్క్ చేస్తూ నిద్రలోకి... లేచి చూసుకుంటే ముఖంపై బల్లి అచ్చు...
పుస్తకం పట్టుకుంటే చాలు చాలామందికి నిద్ర ముంచుకొస్తుంది. చిన్న పిల్లలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. క్లాస్ రూమ్‌లో పాఠాలు వినేటప్పుడు,ఇంట్లో హోమ్ వర్క్ చేసేటప్పుడు... తెలియకుండానే కునికి పాట్లు పడుతుంటారు. నిద్రలోకి జారుకున్నారంటే ఇక ప్రపంచాన్నే మర్చిపోతారు. తైవాన్‌కి చెందిన ఓ చిన్నోడు కూడా హోమ్ వర్క్ చేస్తూ ఇలాగే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కానీ తీరా మేల్కొన్న తర్వాత అతని ముఖం చూసుకుని షాక్ తిన్నాడు. ఆ బుడ్డోడే కాదు... ఆ ఫోటో చూసి సోషల్ మీడియాలో జనాలు కూడా షాక్ తింటున్నారు.
ఇదీ జరిగింది...
ఇంతకీ ఏం జరిగిందంటే... తైవాన్‌కు చెందిన ఓ చిన్నారి హోమ్ వర్క్ చేస్తూ పుస్తకంపై తల వాల్చి నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఆ సమయంలో పుస్తకంపై బల్లి ఉండటాన్ని అతను గమనించలేదు. మూతలు పడుతున్న కళ్లతో పుస్తకంపై తల పెట్టి గాఢ నిద్రలోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత లేచి చూసుకుంటే... ముఖంపై బల్లి అచ్చు కనిపించింది. ఇదేంటా అని పుస్తకం వైపు చూస్తే... అక్కడ చచ్చిన బల్లి కనిపించింది. ఆ చిన్నారి తల కింద నలిగిపోయి అది చచ్చిపోయింది.

ట్విట్టర్‌లో అతను షేర్ చేయడంతో...
జాక్సన్ లు అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 'మీరు మీ హోమ్ వర్క్ చేస్తూ నిద్రలో మునిగిపోతే... చచ్చిన బల్లిపై పడుకున్నామని కూడా తెలియదు.' అంటూ ఆ చిన్నారి ఫోటోలను షేర్ చేశాడు. ముఖంపై బల్లి అచ్చుతో ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ఆ బుడ్డోడి ముఖాన్ని చూసి విరగబడి నవ్వుతుంటే... మరికొంతమంది 'ఓ మై గాడ్... బల్లిపై ఎలా పడుకున్నావురా చిన్నోడా' అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ఫన్నీ కామెంట్స్...
ఇదే పరిస్థితి గనుక నాకు ఎదురైతే.. నిద్రలో నుంచి లేచాక ఆ సీన్ చూస్తే వెంటనే చచ్చిపోతా.. అంటూ ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. 'నాకు చైనీస్ రాదు... ఆ పోస్టులో అతను ఏం రాశాడో తెలియదు. కానీ ఆ చిన్నారి ముఖం చూస్తే చాలు ఏం జరిగి ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 'నాకైతే అది చూస్తేనే వాంతు చేసుకున్న ఫీలింగ్ కలుగుతోంది.' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా రకరకాల ఫన్నీ కామెంట్లతో ఇప్పుడీ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్వీట్‌ను 5600 మంది రీట్వీట్ చేశారు. దాదాపు 6600 మంది లైక్ చేశారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications