రేప్: లైవ్ లో యువతి ఆత్మహత్య
పారిస్: జీవితంపై విరక్తి చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యను పెరిస్కోప్ అనే యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి హడలు పుట్టించింది. దక్షిణ పారిస్ లోని ఇగ్లీలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
19 సంవత్సరాల యువతి అత్యాచారానికి గురైయ్యింది. అత్యాచారం జరిగిన తరువాత ఆమె జీవితంపై విరక్తి పెంచుకుంది. తన మీద అత్యాచారం చేశారని ఆమె ఫోన్ లో రికార్డు చేశారు. తరువాత ఇగ్లీలోని సబర్బన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసు అధికారులు ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వీడియోను పరిశీలిస్తున్నారు. అంతే కాకుండ ఆత్మహత్య చేసుకున్న వీడియోను లైవ్ లో వీక్షించిన వారిని విచారిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. అయితే ఆత్మహత్య చేసుకున్న యువతి పేరు మాత్రం వెల్లడించలేదు.
పెరిస్కోప్ యాప్ ట్విట్టర్ ఖాతా ద్వారా లైవ్ వీడియోలను అనుమతించే ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ అని పోలీసు అధికారులు చెప్పారు. లైవ్ వీడియోలను వీక్షించేందుకు, షేర్ చెయ్యడానికి ఈ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంది. కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications