లండన్ లో ఉగ్రదాడి: ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు
బ్రిటన్ రాజధాని లండన్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు భారత కాలమానం ప్రకారంగా ఆదివారం తెల్లవారుజామున బ్రిడ్జిపై నడుస్తున్న వారిపైకి వ్యాన్ ను నడిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో 10 మందికి
లండన్: బ్రిటన్ రాజధాని లండన్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు భారత కాలమానం ప్రకారంగా ఆదివారం తెల్లవారుజామున బ్రిడ్జిపై నడుస్తున్న వారిపైకి వ్యాన్ ను నడిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయి.
ఈ ఘటనతో లండన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బ్రిడ్జిని మూసివేశారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే అధికారులతో మాట్లాడారు. వ్యాన్ ను వేగంగా పాదచారులపైకి ఉగ్రవాదులు కారు నడిపారు.

అంతేకాదు కారుదిగి ఓ బాలికను కత్తితో పొడిచినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇదిలా ఉంటే అల్లా కోసం అంటూ ఓ వ్యక్తి పెద్దగా అరిచినట్టు కూడ స్థానికులు చెప్పారు. ఉగ్రదాడిలో పాలుపంచుకొన్నట్టు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అయితే లండన్ లో మరో చోట కూడ ఉగ్రదాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.
నిమిషాల్లోనే ఉగ్రమూక ఆటకట్టు
లండన్‌లో ఉగ్రదాడి ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. తమకు సమాచారం అందిన తర్వాత కేవలం ఎనిమిది నిమిషాల్లోనే ముగ్గురు ముష్కరులను తుదముట్టించారు. పోలీసులకు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.08 నిమిషాలకు పోలీసులకు తొలి సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు రాత్రి 10.16కల్లా ముగ్గురు ముష్కరులను కాల్చేశారు. రెండు చోట్ల ఏకకాలంలో జరిగిన దాడిలో ఆరుగురు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications