వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ మరో విజయం, మాల్యాకు లండన్ కోర్టు భారీ షాక్: ఆస్తులు సీజ్! ఇంట్లో సోదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు భారీ షాక్. అతని ఆస్తులు జఫ్తు చేయాలని యూకే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లండన్ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని మాల్యాకు చెందిన ఆస్తులను జఫ్తు చేయాలని సదరు న్యాయస్థానం ఆదేశించింది.

అంతేకాదు, అతను నివాసం ఉంటున్న చోట సోదాలు చేయాలని చెప్పింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిగణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మాల్యా విషయంలో భారత ప్రభుత్వం చర్యలను సమర్థించింది. కాగా, లండన్ కోర్టు ఆదేశాలు భారత ప్రభుత్వం విజయం కాగా, బ్యాంకులకు ఊరట అని చెప్పవచ్చు.

London court orders seizure of Vijay Mallya’s UK assets

కాగా, మాల్యాకు చెందిన ఆస్తుల వివరాల విషయంలో కొంత స్పష్టత వచ్చింది. మొత్తం 159 చోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఈడీతో కలిసి బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించిన నివేదికలను గురువారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మాల్యాకు చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు మరింత సమయం కావాలని కోరారు.

English summary
A UK High Court judge has issued an enforcement order in favour of a consortium of 13 Indian banks, seeking to recover funds owed to them by beleaguered liquor baron Vijay Mallya who is fighting extradition to India on fraud and money laundering charges worth nearly Rs 9,000 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X