గ్రీన్‌ఫెల్ టవర్ అగ్నిప్రమాదం: 9వఅంతస్థు నుంచి పసిపాపను విసిరేసింది!

ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా పేరొందిన గ్రీన్ ఫెల్ టవర్‌లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 74మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు.

లండన్: ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా పేరొందిన గ్రీన్ ఫెల్ టవర్‌లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 74మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. గంటలపాటు శ్రమించిన 50కిపైగా ఫైరింజన్లు మంటలను ఆర్పేశాయి. 500మంది సహాయక సిబ్బంది భవనంలోని పలువురిని కాపాడారు.

ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కొందరు భవనంపై నుంచి దూకి తీవ్రగాయాలయ్యారు. కాగా, నలువైపుల నుంచి కమ్ముకొస్తున్న మంటల నుంచి తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి కూడా సాహసమైన నిర్ణయం తీసుకుంది.

సదరు తల్లి తొమ్మిదో అంతస్థు నుంచి కేకలు వేస్తూ తన బిడ్డను కిందకు విసిరేశారు. కింద గుమిగూడిన జనం ఆమె కేకలు విన్నారు. సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ముందుకు పరుగత్తి ఆ పాపను ఒడిసి పట్టి కాపాడగలిగాడు.

దీంతో ఆ చిన్నారి మృత్యువును జయించింది. కానీ, ఆ చిన్నారి తల్లి మంటల్లో చిక్కుకుందా? లేక ప్రాణాలతో బయటపడిందా? అనే విషయం మాత్రం తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+