సర్వే: ఖరీదైన నగరంగా లండన్, ఆఖరున ముంబై
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా హాంగ్ కాంగ్‌ను వెనక్కు నెట్టి లండన్ అవతరించింది. ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన నగరంగా హాంగ్ కాంగ్ ఉంది. తాజాగా ఓ సర్వేలో లండన్‌లో నివసించడానికి అత్యధికంగా ఖర్చు అవుతుందని వెల్లడించింది.
లండన్‌లో జీవనం ఎంత ఖర్చుతో కూడుకున్నదంటే... ఆ ఖర్చుతో సిడ్నీతో పోల్చితే రెండు రెట్లు, రియో డి జనీరోతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబై 12వ స్దానంలో ఉంది.

కంపెనీలలో ఉద్యోగులను రీలోకేట్ చేయడానికి ప్రపంచంలోని ఆయా నగరాల్లో ఒక్క ఉద్యోగికి అయ్యే ఖర్చును అంచనా వేసేందుకు సావిల్స్ 12 నగరాల నివేదికను తయారు చేసింది. ఏడాదికి ఒక ఉద్యోగికి నివాసం, భోజనం, రవాణా లాంటి ఖర్చులను అమెరికా డాలర్లలో అంచనా వేశారు.
దీని ప్రకారం, ముంబైలో ఓ ఉద్యోగికి ఏడాదికి అయ్యే ఖర్చు రూ.18,13,000 కాగా, లండన్ లో ఓ ఉద్యోగికి రూ.73 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొంది. ఆఫీసు అద్దెలు, డాలర్ తో పోల్చితే పౌండ్ విలువ తదితర అంశాలు లండన్ లో జీవనవ్యయం పెంపునకు కారణాలని సర్వేలో తెలిపింది.
రియల్ ఎస్టేట్ సంస్థ విడుదల చేసిన 12 ఖరీదైన నగరాల జాబితాలో... లండన్ తర్వాత హాంకాంగ్, న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, మాస్కో, సిడ్నీ, దుబాయ్, షాంఘై, రియో డి జనీరో, ముంబై ఉన్నాయి.












Click it and Unblock the Notifications