లండన్‌లో నగ్న రెస్టారెంట్: రేపే ప్రారంభం (ఫోటోలు)
లండన్: పూర్తిస్థాయి సహజత్వాన్ని కోరుకునే వారు కట్టుబాట్లను పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా భోజనం చేసేందుకు లండన్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. దీని పేరు 'బునియాది'. హిందీలో 'ప్రాథమికం' అని అర్థం వచ్చే బునియాదీ అనే పదం ఆధారం గానే ఈ పేరు పెట్టారు.
ఈ నగ్న రెస్టారెంట్‌లో తప్పదనుకుంటే పొదుపుగా దుస్తులను వేసుకునే వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. శనివారం (జూన్ 11)న ప్రారంభ కానున్న ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు గాను ఇప్పటికే 44 వేల మంది వరకు పైగా పేర్లు నమోదు చేసుకున్నారు.

అయితే ఈ రెస్టారెంట్‌లో ఒకేసారి కేవలం 42 మంది మాత్రమే కూర్చునే సదుపాయం మాత్రమే ఉంది. కేవలం 3 నెలలు మాత్రమే ఈ రెస్టారెంట్‌ను నడిపేందుకు లండన్ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే శాఖాహార, మాంసాహార వంటకాలను మట్టికుండల్లో అందిస్తారు.
అంతేకాదు తినేటటువంటి చెంచాలతో వడ్డిస్తారు. ఈ చెంచాలను ఆహార పదార్ధాలతోనే తయారు చేయడంతో వాటిని కూడా మనం తినేయొచ్చు. ఆధునిక సమాజంలో ఆహారం కలుషితం అవుతున్న నేపథ్యంలో రసాయనాలులేని వంటలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.

విద్యుత్, ఫోన్, దుస్తులు ఇలా ఎలాంటివి లేని ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసమే దీనిని నెలకొల్పినట్లు రెస్టారెంట్ మాతృసంస్థ అయిన 'లాలీపాప్' వ్యవస్థాపకుడు సెబ్ లేయాల్ ప్రకటించారు. శనివారం ప్రారంభంకానున్న ఈ రెస్టారెంట్‌లో పూర్తి నగ్నంగా ఉండే కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
కొవ్వొత్తుల కాంతుల్లో, వెదురు కర్రలతో రూపొందించిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. నగ్నంగా ఉండాలనుకునే వారికి ఈ రెస్టారెంట్ ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications