డిసెంబర్ 31న ఆకాశంలోకి చూడండి..: నాసా
డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలోకి చూస్తే.. 45పీ హోండా-మార్కోస్-పజ్డూసకోవా అనే తోక చుక్క దర్శనమివ్వబోతుందని నాసా శాస్జ్రజ్ఞులు తెలిపారు.
న్యూయార్క్: కొత్త సంవత్సరం సమీపించిన నేపథ్యంలో.. కొత్త ఏడాదికి సరిగా ఒకరోజు ముందు ఖగోళంలో ఓ తోక చుక్క కనిపించబోతుందని నాసా ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలోకి చూస్తే.. 45పీ హోండా-మార్కోస్-పజ్డూసకోవా అనే తోక చుక్క దర్శనమివ్వబోతుందని నాసా శాస్జ్రజ్ఞులు తెలిపారు.

అయితే నేరుగా కళ్లతో చూసేవారికి ఇది కనబడే అవకాశం లేదు. కాబట్టి ఈ తోక చుక్కను చూడాలంటే ఖచ్చితంగా బైనాకులర్స్ ఉపయోగించాల్సిందే. 1948లో హోండా, మార్కోస్, సకోవా అనే ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ తోక చుక్కను కనిపెట్టడం వల్ల వారి పేర్లు వచ్చేలాగానే ఈ తోకచుక్కకు పేరు పెట్టారు.
కాగా, ఈ తోక చుక్క 5.25 ఏళ్లకోసారి తాను సూర్యుడు చుట్టూ తిరిగే గమనాన్ని పూర్తి చేసుకుంటుందని, ఆ క్రమంలోనే అది భూమికి సమీపంగా వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఆ తర్వాత సూర్యుడి నుంచి దూరమవతున్నా కొద్ది కనుమరుగవుతుందని నాసా వర్గాలు వెల్లడించాయి. ఇది తొలిసారిగా డిసెంబర్ 15వ తేదీన కనిపించిందని, రోజురోజుకు కొంత వెలుతురూ పెరుగుతూ జనవరి 1వ తేదీ వరకు కనిపిస్తుందని నాసా పేర్కొంది.












Click it and Unblock the Notifications