లాస్ ఏంజలస్: విమానం ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు దూకేశారు

లాస్ ఏంజెలస్ ఎయిర్ పోర్ట్

లాస్ ఏంజలస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కదులుతున్న విమానంలోంచి ఓ వ్యక్తి బయటకు దూకేశారు.

విమానం బయలుదేరి రన్‌వేలో నడుస్తుండగా ఆ వ్యక్తి తన సీటు నుంచి లేచి కాక్‌పిట్ వైపు వెళ్లారు.

కాక్‌పిట్ తలుపులపై బాదారు. అవి తెరుచుకోకపోవడంతో ఎమర్జెన్సీ డోరు తెరిచి బయటకు దూకేశారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది.

రన్‌వేలోనే ఆయనను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా అనేది ఇంకా తెలియలేదు.

ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం స్థానిక సమయం 19.10 గంటలకు లాస్ ఏంజలస్ నుంచి సాల్ట్ లేక్ సిటీకి బయలుదేరిన స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్ వారి యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో జరిగింది.

ఇటీవల అమెరికాలో ఇలాంటి విమాన ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే సుమారు 3,000 సంఘటనలు నమోదయ్యాయి.

ఈ వ్యక్తి సీటులోంచి లేవడం, కాక్‌పిట్ వైపు వెళ్లడం విమాన సిబ్బంది చూశారని ఎన్‌బీసీ న్యూస్ తెలిపింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎందుకు అలా చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో చట్టాన్ని ఉల్లంఘించిన కేసులను దర్యాప్తు చేసినట్లు ఈ నెల ప్రారంభంలో ఎఫ్ఏఏ తెలిపింది. వీటిల్లో చాలావరకు మాస్కులు వేసుకోవడానికి నిరాకరించిన కేసులే.

మే 25 నాటికి "విమాన సిబ్బంది విధుల్లో కలుగజేసుకోవడానికి ప్రయత్నించిన" కేసులు సుమారు 394 నమోదయ్యాయని ఏజెన్సీ తెలిపింది.

ఈ సంఖ్య గత ఏడాది మొత్తంలో దర్యాప్తు చేసిన 183 కేసుల కన్నా రెట్టింపు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+