రూ.20కే బోలెడు కొత్త సినిమాలు
క్రిస్మస్ కానుకగా గూగుల్ తన ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసు అయిన ప్లే మూవీస్ లో కేవలం రూ.20కే ఎన్ని కొత్త సినిమాలనైనా చూసే అవకాశం కల్పిస్తోంది.
న్యూయార్క్: రూ.20కే బోలెడు కొత్త సినిమాలు వీక్షించే అవకాశం కల్పిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు అంటారా.. అయితే దానికి సిద్ధమైపొండి మరి. 'ఏ థియేటర్లో అబ్బా..' అంటూ ఆలోచనలో పడిపోకండి. ఇది థియేటర్లో కాదు.. ఆన్ లైన్ లో. పైగా ఈ అవకాశం ఏదో ఒక్కరోజో, రెండ్రోజులో కూడా కాదు, వచ్చే నెల 23 వరకు ఎడాపెడా చూసేయొచ్చు.
క్రిస్మస్ కానుకగా గూగుల్ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల్లో ఒక కొత్త ప్రమోషనల్ ఆఫర్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. కేవలం రూ.20కే గూగుల్ ప్లే మూవీస్ లో ఎన్ని కొత్త సినిమాలనైనా చూసే అవకాశం కల్పిస్తోంది.

ఆశ్చర్యం ఏమిటంటే.. సరికొత్త సినిమాలకు కూడా ఈ ఆఫర్ వర్తింపజేయడం. ఇటీవల సూపర్ హిట్ కొట్టిన ది జంగిల్ బుక్, సూసైడ్ స్క్వాడ్, ఫైండింగ్ డోరి, సుల్తాన్, ఎక్స్ మెన్, క్యాప్టెన్ అమెరికా, జాసన్ బోర్న్, జూటోపియా, సివిల్ వార్ వంటి సినిమాలు కూడా వినియోగదారులు చూడవచ్చు.
క్రిస్మస్ , న్యూ ఇయర్ నేపథ్యంలో వినియోగదారులకు ఈ ఆఫర్ ను ఇస్తున్నామని, కేవలం పండగ రోజుల్లో మాత్రమే కాదని, ఈ ఆవకాశం జనవరి 23వ తేదీ వరకు ఉంటుందని గూగుల్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications