ఇప్పుడు అక్కడ ‘లవ్ లాక్స్- లిప్ లాక్స్’ లేవు!
ప్యారిస్: ఇప్పుడు అక్కడ లవ్ లాక్స్(ప్రేమ తాళాలు)లకు చోటు లేదు. అంతేగాక, అక్కడ ప్రేమ జంటల లిప్‌లాక్‌లకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ప్యారిస్‌లోని లవ్ లాక్స్‌కు పేరుగాంచిన పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జ గురించి.
ప్రేమ జంటలు తమ ప్రేమ కలకాలం ఉండాలని కోరుతూ ఆ బ్రిడ్జికి తాళాలు వేస్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో.. అంటే దాదాపుగా 100 సంవత్సరాల క్రితం నుంచి.. ప్రపంచం నలుమూలల నుంచి పారిస్‌కు పర్యటనకు వచ్చే ప్రేమికులు ఇలా తాళాలు వేసేవారట.

ఇలా వారు వేసిన 7 లక్షల తాళాల బరువును మోయలేక కిందటేడాది ఈ బ్రిడ్జి రెయిలింగ్ కాస్తా.. నదిలో కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగి ఆ లవ్‌లాక్స్‌ను తీసేయాలని నిశ్చయించారు. సిబ్బందికి పురమాయించారు.

దీంతో మున్సిపల్ సిబ్బంది బోల్ట్ కట్టర్లు, బ్లేళ్లతో రంగంలోకి దిగి మొత్తం బ్రిడ్జి మీద ఉన్న ప్యాడ్‌లాక్‌లన్నింటినీ తీసేశారు. ఈసారి తాళాలు వేయడానికి వీల్లేని అద్దాలను ఈ బ్రిడ్జిపై బిగించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications