మొసలి ముందే వారిద్దరూ ప్రేమికలయ్యారు, ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.

అస్ట్రేలియా :ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక్కోక్కరు ఓక్కో రకంగా వ్యవహారిస్తారు. అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలికి ముందు తన ప్రేమ ప్రతిపాదన తెచ్చి ఆమెను ఒప్పించడానికి పెద్ద సాహాసమే చేశాడు. ఆ సాహాసమే ప్రస్తుతం ఆయన్ను వార్తల్లో నిలిపింది. ఈ ప్రేమ ప్రతిపాదన వీడియో ఫేస్ బుక్ లో వైరల్ గా మారింది.ప్రాణాలకు తెగించి ప్రియురాలు ప్రేమను పొందాడు ఆ యువకుడు.

అస్ట్రేలియాలోని మొసళ్ళ పెంపక కేంద్రంలో పనిచేస్తోన్న ఓ యువకుడు మొసలి ఎన్ క్లోజర్ వద్దకు వెళ్ళి మరీ తన ప్రేమను తన ప్రియురాలికి తెలిపాడు. ఆ ప్రేమను ఆమె అంగీకరించింది. మొసలి సమీపంలో ఉన్న ప్రాణాలకు తెగించి తన ప్రేమను వ్యక్తం చేయడం పట్ల ప్రియురాలు కూడ అతని ప్రేమను అంగీకరించకతప్పలేదు.

crocodile

అస్ట్రేలియాలోని మొసళ్ళ సంరక్షణ కేంద్రంలో పనిచేసే బిల్ కొల్లెట్ అనే యువకుడు మొసళ్ళ ఎన్ క్లోజర్ లో నాలుగున్నర మీటర్ల దూరంలో ఎల్వీస్ అనే మొసలి ఉండగానే తన ప్రేమ ప్రతిపాదను తెలిపాడు.పక్కన మొసలి ఉండగానే మోకాళ్ళపై కూర్చొని మరీ ఆయన తన ప్రేమను శియోభన్ కు చెప్పాడు. అతని దైర్యానికి ఆమె మురిసిపోయింది. ఆయన ప్రేమను అంగీకరించింది.

ఈ ప్రేమ ప్రతిపాదనను ఆమె అంగీకరించగానే అక్కడే వారిద్దరూ లిప్ లాక్ చేసుకొన్నారు. కౌగిలించుకొన్నారు. ఈ వినూత్న ప్రేమ ప్రతిపాదనను చూసిన జనం తమ చప్పల్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొసలి సాక్షిగా ఒక్కటవుతున్న ఈ జంట ీడియోను కొందరు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+