పోర్న్ చూసిన బాలుడు.. అయినా సేఫ్, క్షమించి వదిలేసిన డిక్టేటర్.. ఎక్కడ అంటే
డిక్టేటర్, నియంత, ఆధునిక హిట్లర్.. అచ్చం కరెక్టుగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు సరిపోతోంది. అక్కడ చట్టాల అమలు అంత కఠినంగా ఉంటాయి. కిమ్ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని బయట చర్చ జరుగుతుంది. తన ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై ఏ మాత్రమూ కనికరం చూపకుండా అత్యంత కఠిన శిక్షలు విధిస్తారనే సంగతి తెలిసిందే.

పోర్న్ వీడియోలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా, పోర్న్ వీడియోలు చూసినా, నిబంధనలను ఏ మాత్రం అతిక్రమించినా వారికి మరణ దండన తప్పనిసరిగా విధిస్తారు. పోర్న్ వీడియోలు చూస్తున్న ఓ బాలుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే అతనికి కిమ్ స్వల్ప శిక్షతో సరిపెట్టాడు. దీంతో ఆ బాలుడు అదృష్టవంతుడేనని ప్రజలు కామెంట్స్ చేస్తున్నారు.

మరణశిక్షే
స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి, పోర్న్ వీడియోలు చూస్తే, ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలిపేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అటువంటి వీడియోలు చూసినా, అవి దొరికినా, వాటిని అమ్మినా మరణశిక్షేనని హెచ్చరిస్తున్నారు కూడా. ఇంట్లో పెద్దలు ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు అడల్డ్ వీడియోలు చూస్తున్నట్టు పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి, అతన్ని పట్టుకున్నారు.

సామాజిక బహిష్కరణ
శిక్షగా బాలుడితో పాటు అతని కుటుంబీకులు, బాలుడు చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌కు సామాజిక బహిష్కరణ శిక్ష విధించారు. వారిని సరిహద్దు ప్రాంతంలో ఉన్న లేబర్ క్యాంప్‌కు తరలించాలని కిమ్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఉత్తర కొరియాలో పోర్న్ చూస్తూ పట్టుబడిన వారికి విధించిన శిక్షల్లో ఇదే చాలా చిన్న శిక్షని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.

ప్రిన్సిపాల్ దోషి..
కొరియా చట్టాల ప్రకారం విద్యార్థి తప్పు చేస్తే, పాఠశాల ప్రిన్సిపాల్‌కు కూడా శిక్ష తప్పదు. బాధ్యతా రాహిత్యాన్ని ఏ మాత్రమూ సహించని కిమ్, స్వల్ప శిక్షతో సరిపెట్టారంని చర్చ జరుగుతుంది. అంతేకాదు కిమ్ మారుతున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయని కొందరు కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications