అనుభవించు రాజా : అంత పెద్ద జంబో జెట్‌లో ఇతనే కింగ్

విమానంలో ప్రయాణించడమంటే అదో తియ్యటి అనుభూతి. మొదటిసారి విమానంలో ప్రయాణించే వారైతే ఆ ఉత్సాహాన్ని మాటల్లో చెప్పలేరు. ఇక ఒక సొంత విమానం ఉంటే... ఎక్కడికైనా అందులో ప్రయాణించొచ్చు. ఇక ఆ విమానంలో మనం ఏమి చేసిన అడిగే నాథుడే ఉండడు. ఇక్కడ కూడా ఓ వ్యక్తికి అలాంటి ఛాన్సే లభించింది. అయితే అది సొంత విమానం కాదు... కానీ సొంత విమానంలో ఎలా అయితే ఉంటాడో అలానే ఈ జంబో జెట్ విమానంలో కూడా ఉన్నాడు.

Lucky man:This is the only passenger who travelled in boeing 168 seater

వివరాల్లోకెళితే... సాద్ జిలానీ అనే ఈ వ్యక్తి కోర్ఫూ నుంచి బ్రిమ్మింగ్హామ్‌కు ఓ ప్రైవేట్ బోయింగ్ 738 విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఆ విమానంలో ఐదుగురు సిబ్బంది తప్ప ఒక్క ప్రయాణికుడు కనిపించలేదు. మొత్తం 168 సీట్లు ఖాళీగా ఉన్నాయి. విమానం బయలుదేరేందుకు ఇంకా సమయం ఉందికదా అనుకొని అలానే తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. విమానం కదిలేందుకు సమయం దగ్గర పడుతోంది. అయినా ఒక్క ప్రయాణికుడు కూడా రాలేదు. ఇక ఎయిర్ హోస్టెస్‌లు తమ జాగ్రత్తలు చెబుతున్నారు. మరికాసేపట్లో విమానం టేకాఫ్ తీసుకుంటుందని పైలట్ క్యాబిన్ నుంచి ప్రకటన వచ్చేసింది. ఇంకా ప్రయాణికులు ఎవరూ రాకపోవడంతో ఈ వ్యక్తి సిబ్బందిని అడిగాడు.

Lucky man:This is the only passenger who travelled in boeing 168 seater

ఈ విమానంలో మీరు తప్ప మరో ప్రయాణికుడు లేరని వారు సమాధానం చెప్పగానే... జిలానీ ఒక్కింత ఆందోళనకు గురయ్యాడు... వెంటనే ఆనందానికి గురయ్యాడు. అనుభవించు రాజా అంటూ ఒక్కడే విమానం మొత్తం కలియతిరిగాడు. అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు టైంపాస్ చేశాడు. సిబ్బందితో ఎంచక్కా కబుర్లు చెప్పాడు. వారితో సెల్ఫీలు దిగాడు. సాధారణంగా ప్రయాణికుడిని పైలట్ క్యాబిన్ లోకి అనుమతించరు. కానీ ఈ అదృష్టవంతుడికి ఏకంగా పైలట్ సీటులో కూర్చొనే అవకాశం దక్కింది. మొత్తం రెండున్నర గంటలపాటు ఈ విమాన ప్రయాణం సాగింది. చివరకు గమ్యస్థానం రాగానే సిబ్బంది మొత్తానికి కృతజ్ఞతలు తెలిపాడు సాద్ జిలానీ. ఇలాంటి బంపర్ బొనాంజా జీవితంలో ఒక్కసారి వస్తుందని చెప్పాడు ఈ ఏకైక ప్రయాణికుడు జిలానీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+